గ్లామర్ వదిలేశాక ఇంత మార్పా?

Wed Feb 14 2018 21:00:01 GMT+0530 (IST)

టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి తొలి ప్రేమ సినిమాపై అంచనాలు ఆకాశం అంత ఎత్తు ఉన్నాయ్ అనడం లో అతిశయోక్తి లేదు. కానీ వరుణ్ తేజ్ పక్కన ఈ ప్రేమ కథ లో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది అన్న వార్త జనాల్లో బోలెడన్ని సందేహాలకు తావిచ్చింది. ఇప్పటిదాకా అన్నీ మాస్ సినిమాలు మాత్రమే చేసిన ఈమె ఒక ఫుల్ లెంగ్త్ లవ్ స్టోరీ లో ఎలా నటిస్తుంది అని అందరూ అనుకున్నారు.ఈ సందేహం ప్రేక్షకులకు మాత్రమే కాదటండి నిర్మాత దిల్ రాజు కు కూడా వచ్చిందంట. ఈ సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ నిర్మాత దిల్ రాజు రాశి ఖన్నా హీరోయిన్ అని చెప్పగానే తాను కూడా మొదట్లో కొంచెం తటపటాయించడని కానీ వెంకీ అట్లూరి నచ్చచెప్పడంతో ఒప్పుకున్నానని కానీ సినిమా పూర్తయ్యేవరకు భయంగానే ఉండేదని చెప్పాడు. 'లవ్ స్టొరీ కి ఒక అమ్మాయి కి అబ్బాయికి మధ్య ఉండవలసిన కెమిస్ట్రీ కరెక్టుగా ఉంటే సినిమా ఆడేస్తుంది అని అప్పుడు ఆ తొలి ప్రేమ ప్రూవ్ చేసింది ఇపుడు ఈ తొలి ప్రేమ ప్రూవ్ చేసింది. వరుణ్ కి రాశి కి మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అయింది' చెప్పుకొచ్చాడు దిల్ రాజు.

నిజంగానే అన్ని మాస్ సినిమాలు అయిన తన గ్లామర్ తో మనల్ని చూపు తిప్పుకొవ్వకుండా చేయగల మ్యాజిక్ రాశి సొంతం. గ్లామర్ తోనే కాదు తన యాక్టింగ్ తో కూడా మెప్పించగల కెపాసిటీ ఉందని తొలి ప్రేమ తో నిరూపించింది. తన యాక్టింగ్ తో ఆదరగొట్టిన రాశి ఈ సినీమా తర్వాత తనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది అనటం విశేషం.