Begin typing your search above and press return to search.

దిల్ రాజు నోట.. అజ్ఞాతవాసి - స్పైడర్ మాట

By:  Tupaki Desk   |   15 Aug 2018 6:16 AM GMT
దిల్ రాజు నోట.. అజ్ఞాతవాసి - స్పైడర్ మాట
X
ఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేసిన నిర్మాత అతడు.. పట్టిందల్లా బంగారమే.. ఆయనతో సినిమా చేస్తానంటూ అగ్రహీరోలు కూడా ఎదురొచ్చి కాల్షీట్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ బడా నిర్మాత దిల్ రాజుకు బ్యాడ్ టైం మొదలైంది. ఆయన తీసిన రెండు వరుస సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. రాజ్ తరుణ్ తో తీసిన ‘లవర్’ రెండో రోజే చాప చుట్టేయగా.. ఇటీవల నితిన్ హీరోగా వచ్చిన ‘శ్రీనివాస కళ్యాణం’ డివైడ్ టాక్ తో బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ అయ్యింది. వసూళ్లు కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ప్రేక్షకులందరూ తిరస్కరించారని ఎన్నో టాకులు చూస్తే అర్థం అవుతుంది. శుక్రవారం రిలీజ్ అయిన మూవీ శని - ఆదివారాలు కాస్తా ఆడగా.. సోమవారం వసూళ్లపై తీవ్ర ప్రభావం పడిందంటున్నారు.

‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా ఫలితంపై తాజాగా దిల్ రాజు స్పందించాడు. దీనికి మంచి వసూళ్లే వస్తున్నాయని చెబుతున్నాడు. ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే నొక్కి వక్కాణించాడు. ‘20ఏళ్లుగా డిస్ట్రిబ్యూషన్ - ప్రొడక్షన్ లో ఉన్నా.. ఏ సినిమా హిట్.. దాని టాక్ ఏంటో నాకు తెలియదా.? కొన్ని సినిమాలు తొలిరోజే డివైడ్ టాక్ తెచ్చుకుంటాయి.. ‘అజ్ఞాతవాసి’ - స్పైడర్ సినిమాలను తానే డిస్ట్రిబ్యూట్ చేశాను.. ఆ సినిమాల వసూళ్లు మొదటిరోజు నుంచి పడుతూ పోయాయి. కానీ ‘శ్రీనివాస కళ్యాణం’ మాత్రం శని - ఆదివారాల్లో మంచి వసూళ్లే దక్కాయి. సినిమా మెల్లిగా పుంజుకుంటుంది..ఇది ఫ్లాప్ కాదు.. ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా నచ్చుతుంది’ అని వివరించాడు.

సినిమా ఫస్ట్ షో పడ్డాకే.. యూట్యూబ్ చానెల్స్ - వివిధ మీడియా సంస్థలు సినిమాను విశ్లేషిస్తుంటాయి. ప్రేక్షకులకు మైక్ లు పెట్టి మరీ టాక్ వినిపిస్తుంటాయి. ఇలా టాక్ ఏంటో జెన్యూన్ గా బయటకు వస్తున్న వేళ.. దిల్ రాజు మాత్రం తన ‘శ్రీనివాస కళ్యాణం’ మూవీని మాత్రం ఇంకా వెనకేసుకొస్తున్నారు. చూడాలి రాజు గారి నమ్మకం సడలాడానికి ఇంకా ఎన్ని రోజులు కావాలో..