ఒక్క ఏడాదిలో ఎంత మార్పు రాజుగారు!

Sat Aug 11 2018 11:25:10 GMT+0530 (IST)

గత ఏడాది దిల్ రాజు బ్యానర్ దివ్యంగా వెలిగింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు సినిమాల నిర్మాణంతో పాటు వాటిని దాదాపు అన్ని కమర్షియల్ సక్సెస్ అయ్యేలా చేసుకోవడంలో నిర్మాతగా తన బ్రాండ్ ఏంటో ఋజువు చేసుకున్నారు. కానీ ఒక్క ఏడాదిలో తేడా వచ్చేసింది. కారణాలు ఏమైనా దిల్ రాజు సినిమాలు ఈ సంవత్సరం చాలా లేట్ గా అకౌంట్ ఓపెన్ చేశాయి. రాజ్ తరుణ్ లవర్ మీద స్వయానా ఆయనే  అంత నమ్మకం లేనట్టుగా విడుదల ముందు నుంచే వ్యవహరించడంతో ప్రేక్షకులు కూడా తమ తీర్పును దానికి అనుగుణంగా ఇచ్చేసారు. ఇక ఎన్నో అంచనాలతో భారీ పబ్లిసిటీతో పెళ్లి కాన్సెప్ట్ తో ముందుకు వచ్చిన శ్రీనివాస కళ్యాణం పెర్ఫార్మన్స్ కూడా ఏమంత ఆశించిన స్థాయిలో లేకపోవడంతో దిల్ రాజు మాత్రమే కాదు బాగానే ఉండొచ్చన్న అంచనాలు పెట్టుకున్న ఫ్యామిలి ఆడియన్స్ కూడా సినిమా చూసాక షాక్ తిన్నారు. పెళ్లి కథను చూపిస్తారు అనుకుంటే పెళ్లి క్యాసెట్ ని వేశారే అనే కామెంట్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యింది.నిజానికి ఈ పరిణామం ఊహించనిది కాకపోవడంతో దిల్ రాజు డ్యామేజ్ రిపేర్ లో పడ్డారు. ఈ శ్రావణ మాసంలో పెళ్లి చేసుకోబోయే కొత్త జంటలకు ఇస్తామన్న పట్టు వస్త్రాలను దగ్గరుండి మరీ హీరో హీరోయిన్ తో సహా క్యాస్ట్ అండ్ క్రూతో ప్యాక్ చేయించి పంపిణి చేసే పనిలో పడ్డారు. ఇలాంటివి ఎన్ని చేసినా ప్రేక్షకుడి తీర్పుని బట్టే వసూళ్లు వస్తాయి కాబట్టి ఈ వీక్ ఎండ్ ఎలాగోలా గట్టెక్కినా సోమవారం నుంచి పరిస్థితి కష్టమే అనేలా ఉంది. బొమ్మరిల్లు విడుదల తేదీ సెంటిమెంట్ ని పదే పదే హై లైట్ చేసుకున్న దిల్ రాజుకు అది సైతం ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయింది. ఇప్పుడు దసరాకు రాబోయే మూడో సినిమా హలో గురు ప్రేమ కోసమే బ్రేక్ ఇస్తుందనే ధృడ నిశ్చయంతో ఉన్నారు దిల్ రాజు. రామ్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా త్రినాథ రావు  దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ అక్టోబర్ 18 విడుదల అన్నారు కానీ మరోసారి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దానికి వారం ముందు అరవింద సమేత వీర రాఘవ ప్లానింగ్ లో ఉండగా అదే రోజు విశాల్ పందెం కోడి 2 అంటూ వస్తున్నాడు. దిల్ రాజు ముందు వెనుకా గట్టి పోటీనే ఉంది.