Begin typing your search above and press return to search.

దిల్ రాజు బలవంతంగా వచ్చాడా..

By:  Tupaki Desk   |   20 Nov 2017 8:02 AM GMT
దిల్ రాజు బలవంతంగా వచ్చాడా..
X
పిల్లా నువ్వు లేని జీవితం.. సుబ్రమణ్యం ఫర్ సేల్.. సుప్రీమ్.. ఇలా సాయిధరమ్‌ తో వరుసగా మూడు సినిమాలు చేసి.. మూడింటినీ సక్సెస్ చేశాడు దిల్ రాజు. ఇప్పుడు సాయిధరమ్ తేజ్ ‘అరుణాచల్ క్రియేషన్స్’ అనే కొత్త బేనర్లో చేసిన ‘జవాన్’ సినిమా విషయంలోనూ దిల్ రాజు హ్యాండ్ ఉంది. ఈ చిత్రానికి రాజు సమర్పకుడు కావడం విశేషం. రాజు స్వయంగా సినిమాలు నిర్మించాడు. కొన్ని సినిమాల్ని టేకప్ చేసి రిలీజ్ చేశాడు కానీ.. ఇలా ఎప్పుడు వేరే సంస్థలో తెరకెక్కిన సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించింది లేదు. ఐతే ఈ చిత్ర బృందం తనను బలవంతంగా ఈ ప్రాజెక్టులోకి తీసుకొచ్చినట్లు దిల్ రాజు వెల్లడించాడు.

ఒక రోజు ‘జవాన్’ నిర్మాత కృష్ణ.. హీరో సాయిధరమ్ తేజ్.. దర్శకుడు బి.వి.ఎస్.రవితో పాటు వీరికి సన్నిహితుడైన హరీష్ శంకర్.. ఈ నలుగురూ వచ్చి ఈ సినిమాలో భాగస్వామి కావాలని బలవంతం చేశారని.. తనకు వీళ్లందరూ కావాల్సిన వాళ్లే కావడంతో తాను ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేయడానికి ముందుకొచ్చాడని రాజు అన్నాడు. జవాన్ మంచి కథతో తెరకెక్కిన సినిమా అని.. ఇందులో కమర్షియల్ విలువలు ఉంటుంటూనే.. కొత్త అప్రోచ్ ఉంటుందని.. రవిలో తనకు ఆ అప్రోచే నచ్చిందని రాజు అన్నాడు. ఈ ఏడాది తన బేనర్లో వచ్చిన ఐదు సినిమాలూ మంచి సక్సెస్ అయ్యాయని.. ఇప్పుడు తాను సమర్పిస్తున్న ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నానని రాజు చెప్పాడు. ఈ సినిమా తాను చూశానని.. మంచి సినిమా అని కచ్చితంగా చెప్పగలనని అన్నాడు. తమన్ రీరికార్డింగ్ గురించి తాను మాట్లాడకుండా ఉండలేనని.. రీరికార్డింగ్ కు ముందు.. వెనుక సినిమా చూశాక తేడా స్పష్టంగా కనిపించిందని.. బ్యాగ్రౌండ్ స్కోర్ తో సినిమా రేంజే మార్చేశాడని రాజు కితాబిచ్చాడు.