Begin typing your search above and press return to search.

మెగా ప్రిన్స్ తో హ్యాట్రిక్ కాంబినేషన్

By:  Tupaki Desk   |   23 April 2019 5:15 AM GMT
మెగా ప్రిన్స్ తో హ్యాట్రిక్ కాంబినేషన్
X
ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రేక్షకుల్లో జెర్సీకి సంబంధించిన చర్చలే కనిపిస్తున్నాయి. న్యాచురల్ స్టార్ నానిని బిరుదుకు తగ్గట్టు చాలా హృద్యమైన ఎమోషన్స్ తో ప్రెజెంట్ చేసిన తీరుకు దర్శకుడు గౌతం తిన్ననూరికి పరిశ్రమ నుంచి సైతం ప్రశంశల జల్లులు కురుస్తోంది. ఇదిలా ఉండగా మొదటి రెండు సినిమాలతో ఘన విజయాలు సొంతం చేసుకుని అందరి దృష్టిలో పడ్డ గౌతం నెక్స్ట్ ఎవరితో చేస్తాడనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

ఫిలిం నగర్ టాక్ ప్రకారం నిర్మాత దిల్ రాజు గౌతం తిన్ననూరిని లాక్ చేసుకున్నట్టు సమాచారం. వరుణ్ తేజ్ హీరోగా అతనికి సెట్ అయ్యే ఒక లైన్ గౌతం చెప్పాడని ప్రాధమిక దశలో అది విపరీతంగా నచ్చడంతో హీరో నిర్మాత ఇద్దరు ఓకే చెప్పినట్టుగా టాక్. ఫుల్ స్క్రిప్ట్ డెవలప్ చేయడానికి ఎలాగూ టైం కావాలి కాబట్టి ఆలోపు వరుణ్ తేజ్ వాల్మికి ఫినిష్ చేసుకుంటాడు

ఒకవేళ ఇది నిజమైతే వరుణ్ తేజ్-దిల్ రాజులకు హ్యాట్రిక్ మూవీ అవుతుంది. మొదట వచ్చిన ఫిదా వరుణ్ తేజ్ కెరీర్లో అప్పటి దాకా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సాయి పల్లవిని ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెడితే వరుణ్ మార్కెట్ దీంతోనే స్ట్రాంగ్ అయిపోయింది.

ఇక ఈ ఏడాది వచ్చిన ఎఫ్2 సంగతి సరే సరి. ఊహించని విధంగా 80 కోట్ల దాకా షేర్ రాబట్టి ఇండస్ట్రీ రికార్డులు తన ఖాతాలో వేసుకుంది. ఒకదాన్ని మించి ఒకటి ఆడాయి కాబట్టి ఇప్పుడు హ్యాట్రిక్ కాంబో అంటే క్రేజ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అందులోనూ జెర్సీ డైరెక్టర్ అంటే వేరే చెప్పాలా. అయితే ఇది నిర్ధారణ కావడానికి ఇంకొంత టైం అయితే పడుతుంది