Begin typing your search above and press return to search.

ద‌స‌రాకు `హ‌లో గురూ ప్రేమ‌కోస‌మే`!

By:  Tupaki Desk   |   11 July 2018 12:59 PM GMT
ద‌స‌రాకు `హ‌లో గురూ ప్రేమ‌కోస‌మే`!
X
టాలీవుడ్ లో ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు - న‌టీన‌టుల‌కు సంక్రాంతి - ద‌స‌రా వంటి పండుగ‌ల‌కు సినిమాలు రిలీజ్ చేస్తే త‌ప్ప‌క హిట్ అవుతాయ‌నే సెంటిమెంట్ ఉంటుంది. నంద‌మూరి హీరో బాల‌కృష్ణ‌కు సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువ‌. అదే త‌ర‌హాలో నిర్మాత దిల్ రాజుకు ద‌స‌రా సెంటిమెంట్ ఉంది. దిల్ రాజు నిర్మాణ సార‌థ్యంలో గ‌తంలోద‌స‌రాకు విడుద‌లైన సినిమాలు హిట్ అయ్యాయి. అదే సెంటిమెంట్ ను కొన‌సాగిస్తూ...ఈ ద‌స‌రాకు కూడా ఓ సినిమాతో దిల్ రాజు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. రామ్ - అనుప‌మా ప‌ర‌మేశ్వ‌రన్ ల కాంబోలో తెర‌కెక్కుతోన్న `హ‌లో గురూ ప్రేమ కోస‌మే`ను ద‌స‌రాకు విడుద‌ల చేసేందుకు దిల్ రాజు రెడీ అయ్యారు. ఇప్ప‌టికే వెంక‌టేశ్వ‌రా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో తెర‌కెక్కిన ల‌వ‌ర్, శ్రీ‌నివాస క‌ల్యాణం రిలీజ్ కు రెడీ అయిన సంగ‌తి తెలిసిందే.

మ‌రోవైపు - `సినిమా చూపిస్త మావ‌` - `నేను లోక‌ల్` చిత్రాలతో ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన వరుస హిట్ లు కొట్టారు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలోనే `హ‌లో గురూ ప్రేమ కోస‌మే` చిత్రం తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే ఈ చిత్రం టాకీ పార్ట్.....పాట‌లు మిన‌హా షూటింగ్ పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ తో పాటు మిగిలిన ప‌నుల‌ను పూర్తి చేసి అక్టోబ‌ర్ 18న సినిమాను విడుద‌ల చేయాల‌ని దిల్ రాజు స‌న్నాహాలు చేస్తున్నారు. రామ్ - అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ - విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్‌ రాజ్ న‌టిస్తోన్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. మ‌రి, దిల్ రాజు సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయి....ఈ విజ‌య ద‌శ‌మికి మ‌రో విజ‌యం వ‌రిస్తుందేమో వేచి చూడాలి.