Begin typing your search above and press return to search.

రవితేజ కొడుకు.. మహేష్‌ బాబులా..

By:  Tupaki Desk   |   19 Oct 2017 5:00 AM GMT
రవితేజ కొడుకు.. మహేష్‌ బాబులా..
X

‘‘కమర్షియల్ సినిమా అంటే పెట్టిన పెట్టుబడికి తిరిగి లాభాలు తెచ్చిపెట్టేది. అలాగని కమర్షియల్ సినిమాల వల్ల పేరొస్తుందని ఆశించలేం. అలాంటి సినిమాలు చాలా తక్కువ చూస్తాం.. పేరు తేవడంతో పాటు డబ్బులు కూడా తెచ్చిపెడుతున్న చిత్రం రాజా ది గ్రేట్’’ అంటూ ఆ సినిమా నిర్మాత దిల్ రాజు ఆనందపడిపోతున్నాడు. రవితేజ హీరోగా.. మెహ్రీన్ హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ మధ్యనే థియేటర్లకొచ్చింది. ఇందులో అంధుడి పాత్రలో రవితేజ నటన - కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా రాజా ది గ్రేట్ విజయోత్సవ సభ జరిగింది. ఇందులో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘‘రాజా ది గ్రేట్ సినిమా చూసిన వారెవరూ నాకు ఈ సినిమా నచ్చలేదు అనరు. అందుకు నేను గ్యారంటీ ఇస్తా. రవితేజ సినీ జీవితంలో ఇదో బ్రహ్మాండమైన హిట్. అతడి కొడుకు మహాధన్ ఇందులో నటించడం ఓ రకంగా బోనస్. ఈ పాత్ర అతడు చేయడానికి రవితేజ ఒప్పుకోడేమోనని అనుకున్నా. డైరెక్టర్ అనిల్ రావిపూడి తాను ఒప్పిస్తానని చెప్పి రవితేజతో ఎస్ అనిపించాడు. థియేటర్ లో మహాధన్ ను చూస్తే మరో హీరో పుట్టేశాడని అనిపించింది. మహేష్‌ బాబు గారి తరహాలో చైల్డ్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకుని.. తరువాత పెద్ద స్టార్ అవుతాడు మహాధన్’’ అంటూ రవితేజ ఫ్యాన్స్ లో జోష్ నింపేలా మాట్లాడాడు.

రాజా ది గ్రేట్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి దర్శకుడిగా ఇది మూడో సినిమా. పటాస్ - సుప్రీమ్ హిట్ తర్వాత రాజాది గ్రేట్ రావడంతో అతడికి హ్యాట్రిక్ హిట్ దక్కినట్టయింది. దిల్ రాజుకు హోం ప్రొడక్షన్ శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ కు వరసగా ఐదో హిట్ లభించింది. ఐదు బాల్స్ సిక్సర్ కొట్టాం. సిక్స్త్ బాల్ కోసం వెయిట్ చేస్తున్నామంటూ దిల్ రాజు తమ విజయ పరంపర గురించి పబ్లిక్ ఎదుట ఆనందం పంచుకున్నాడు.