Begin typing your search above and press return to search.

ఫేక్ కలక్షన్స్ పై స్పందించిన దిల్ రాజు

By:  Tupaki Desk   |   18 July 2017 4:43 AM GMT
ఫేక్ కలక్షన్స్ పై స్పందించిన దిల్ రాజు
X
నిర్మాతగా దిల్ రాజు స్టామినా ఏంటనే విషయం ఇప్పటికే ప్రూవ్ అయిపోయింది. ప్రతీ సినిమాను ఎంతో జాగ్రత్తగా తెరకెక్కించే ఈయన.. ఈ కాలంలో నిర్మాణ సంస్థకు విలువ తెచ్చిన వ్యక్తిగా చెప్పచ్చు. అయితే.. అల్లు అర్జున్ డీజే విషయంలో మాత్రం.. వసూళ్లను అటూ ఇటూ చేసి చెప్పారనే టాక్ వినిపించింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ ఫిదా ప్రచారంలో ఉన్న దిల్ రాజు.. డీజే వసూళ్లపై వివరణ ఇచ్చారు.

'శతమానం భవతి జనవరిలో వచ్చింది. ఫిబ్రవరిలో నేను లోకల్.. జూన్ లో డీజే విడుదల చేశాం. ఆ సినిమా రిలీజ్ చేసిన వారంలోనే సక్సెస్ మీట్ నిర్వహించాను. ఇది నా హ్యాట్రిక్ ఫిలిం అని అనౌన్స్ చేసినపుడే ఇది హిట్ సినిమా. దిల్ రాజుగా నేను కేవలం నిర్మాతగానే ఆలోచించను. నాకు డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ ఉంది. నైజాంలో.. వైజాగ్ ఏరియాల్లో సినిమాలు కొని డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఫైనల్ గా ఓ స్టేట్మెంట్ ఇచ్చానంటే.. దానికి ఓ విలువ ఉంటుంది. విలువ లేని స్టేట్మెంట్స్ నేను ఇవ్వను. సక్సెస్ ఫిలిం తీయకపోతే నేను మీడియా ముందుకు రాను. సక్సెస్ తీయకుండా మనల్ని మనం మోసం చేసుకుని ఉపయోగం లేదు. కొన్ని సినిమాలకు మార్నింగ్ షోకే రిజల్ట్ తెలుస్తుంది. మరికొన్ని సినిమాలకు డివైడ్ టాక్ కారణంగా.. నాలుగైదు రోజులు పడుతుంది. సోమవారం.. మంగళవారం నాటికిి రిజల్ట్ తెలిసిపోతుంది' అన్నారు దిల్ రాజు.

'అల్లు అర్జున్ కెరీర్ లో సరైనోడు బిగ్గెస్ట్ హిట్ అయితే.. దాన్ని క్రాస్ చేసిన సినిమా డీజే. అలాంటపుడు డీజే హిట్టా కాదా.. సరైనోడు విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. డీజే కలెక్షన్స్ విషయంలో అన్నీ తప్పుడు ఫిగర్స్ ప్రచారం చేస్తున్నారు. అన్ని ఏరియాల నుంచి గ్రాస్.. షేర్ తెప్పించుకుని మళ్లీ పంపించాం. అవన్నీ జెన్యూన్ ఫిగర్స్. వచ్చిన కలెక్షన్స్ కు మరికొంత యాడ్ చేసుకుని చూపించడం లాంటివి ఇప్పటివరకూ చేయలేదు. ఇకపై కూడా చేయను. అలా చేస్తే మమ్మల్ని మేం మోసం చేసుకుంటున్నట్లే. త్వరలో రిలీజ్ కానున్న మహేష్ బాబు మూవీ.. పవన్ కళ్యాణ్ మూవీ.. ఎన్టీఆర్ మూవీలను మేమే రిలీజ్ చేయబోతున్నాం. ఒక హీరో ఫిగర్ తప్పు చెబితే.. అందరు హీరోల దగ్గర ఆ ప్రభావం ఉంటుంది' అంటూ డీజే హిట్ ఫిలిం అని తేల్చేశారు దిల్ రాజు.