Begin typing your search above and press return to search.

చైతూ సినిమాకు పెద్ద బూస్ట్

By:  Tupaki Desk   |   25 Oct 2016 1:30 PM GMT
చైతూ సినిమాకు పెద్ద బూస్ట్
X
నాగచైతన్య-గౌతమ్ మీనన్ కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా ‘ఏమాయ చేసావె’ ఎలాంటి ఇంపాక్ట్ వేసిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమా ఒక క్లాసిక్ లాగా నిలిచిపోయింది. మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా అనగానే మొదట్నుంచి జనాల్లో మంచి అంచనాలున్నాయి. దీనికి తోడు ఈ సినిమా ఫస్ట్ టీజర్.. పాటలు అన్నీ కూడా సినిమా మీద ఆసక్తిని మరింత పెంచాయి. కానీ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ కాకపోవడం.. వాయిదాల మీద వాయిదాలు పడుతూ.. అసలు ఎప్పుడు రిలీజవుతుందో క్లారిటీ లేని పరిస్థితి రావడంతో జనాలకు నెమ్మదిగా ఆసక్తి తగ్గిపోయింది. ఓ దశలో ఈ సినిమా గురించి చర్చలే ఆగిపోయాయి.

ఐతే ఈ మధ్యే చైతూ కొత్త సినిమా ‘ప్రేమమ్’ రిలీజై మంచి విజయం సాధించడం..అదే సమయంలో ‘సాహసం శ్వాసగా సాగిపో’ తమిళ వెర్షన్ విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోవడంతో రిలీజ్ కు మార్గం సుగమమైంది. నవంబర్లోనే ఈ చిత్రం విడుదలవుతుందని హింట్ ఇచ్చేశాడు గౌతమ్. దీంతో సినిమా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. జనాల్లో ఆసక్తి మొదలైంది. అదే సమయంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్టులోకి అడుగుపెట్టడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘సాహసం శ్వాసగా సాగిపో’ రషెస్ చూసి ఇంప్రెస్ అయిన దిల్ రాజు.. నైజాంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ముందుకొచ్చాడట. ఈ వార్త కచ్చితంగా ఈ చిత్రం మీద పాజిటివ్ బజ్ పెంచేదే. దిల్ రాజుకు నచ్చి రైట్స్ తీసుకున్నాడంటే ఆ సినిమాలో కంటెంట్ ఉన్నట్లే అని ప్రేక్షకుల్లోనూ ఓ భరోసా ఉంటుంది. ఇంతకీ ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడన్నదే తేలాల్సి ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/