#పవన్25 ను 30కి కొనేస్తున్నాడు

Wed Sep 13 2017 14:26:58 GMT+0530 (IST)

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజుకి ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. అయన నిర్మించిన శతమానం భవతి - నేను లోకల్ సినిమాలతో పాటు ఫిదా మంచి కలెక్షన్స్ ను రాబట్టాయి. పెట్టిన పెట్టుబడి కంటే దిల్ రాజుకు  నాలుగు రూపాయలను ఎక్కువనే అందించాయి ఈ సినిమాలు. డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఆ చిత్రాలు మంచి వసూళ్లనే అందించాయి. టైమ్ బావున్నపుడే ఓ నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి అంటారు కదా.. ఇప్పుడు దిల్ రాజు కూడా అదే పనిలో ఉన్నారు.డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఆయన నిర్మాతగా మారిన తరువాత కూడా ఇంకా ఆ తరహాలో బిజినెస్ ను చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం పవన కళ్యాణ్ 25వ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా నైజాం ఏరియాల్లో బాహబలి తర్వాత పవన్ సినిమానే అత్యధిక ధరకు అమ్ముడుపోతోందట. దాదాపు 30 కోట్లు పలకనుందని తెలుస్తోంది. అయితే నిర్మాత దిల్ రాజు నైజాం హక్కులను ఈ మొత్తం వెచ్చించి హక్కుల పొందనున్నట్లు టాక్.

త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్ అంటే మాములుగా ఉండదు మరి ఇప్పటికే వీరిలో కలయికలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షాన్ని కురిపించింది. దీంతో ఈ సారి దిల్ రాజు తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నట్లు తెలుస్తోంది.