Begin typing your search above and press return to search.

కుమారి సినిమాను రాజుగారు కొనేశారు

By:  Tupaki Desk   |   26 Oct 2016 5:30 PM GMT
కుమారి సినిమాను రాజుగారు కొనేశారు
X
మనం ముందే చెప్పినట్లు.. షాకింగ్ కంటెంట్ తో ఇప్పడు ''నాన్న.. నేను.. నా బాయ్‌ ఫ్రెండ్స్'' అనే సినిమాతో వస్తోంది ''కుమారి 21 ఎఫ్‌'' ఫేం హెబ్బా పటేల్. అమ్మడు ఈ సినిమాలో కూడా బీభత్సంగా తన సెక్సీ సైడ్ చూపించేసిందట. అయితే ఆ సైడ్ కంటే కూడా ఈ సినిమాలో నూతన దర్శకుడు భాస్కర్ చూపించిన కంటెంట్ చాలా స్ర్టాంగ్ అండ్ ఇంప్రెసివ్ అంటున్నారు సన్నిహితులు. అందుకే ఈ సినిమాపై రాజు గారు కూడా కన్నేశారు.

ఈ మధ్యన మాంచి సినిమాలు ఏం కనిపించినా కూడా.. వరుసపెట్టి కొనేస్తున్న దిల్ రాజు.. ఇప్పుడు ''నాన్న.. నేను.. నా బాయ్‌ ఫ్రెండ్స్'' కంటెంట్ చూసి బాగా ఇంప్రెస్ అయిపోయారట. మొన్ననే 'ఇలా నీ జతగా' అనే సినిమాను కొన్న దిల్ రాజు.. నిన్న 'సాహసం శ్వాసగా సాగిపో' నైజాం రైట్స్ కొనేశారు. ఇప్పుడైతే ఏకంగా ఈ హెబ్బా పటేల్ సినిమా తాలూకు నెగెటివ్ రైట్స్ కొనేశారు. అంటే సినిమా మొత్తం ఇప్పుడు రాజు గారిదే. సింపుల్ గా అన్ని ఏరియాల్లో అయితే ఆయనే రిలీజ్ చేసుకుంటారు లేదంటే అమ్మేస్తారు.

ఇకపోతే ఈరోజు రిలీజ్ చేసిన ఈ బాయ్ ఫ్రెండ్స్ సినిమా మోషన్ పోస్టర్ కూడా జనాలను బాగా ఇంప్రెస్ చేసింది. కేరింగ్ తండ్రిగా రావు రమేష్‌.. నాటి గాళ్‌ గా హెబ్బా.. అలాగే ఆమెకు ముగ్గురు బాయ్‌ ఫ్రెండ్స్.. ఇంప్రెసివ్ గురూ!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/