లవకుశ.. 20 అంటే కష్టమేనన్నాడు

Wed Sep 13 2017 13:56:56 GMT+0530 (IST)

ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన జై లవ కుశ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయిలో స్టామినా ను చూపిస్తుందో తెలియదు గాని పంపిణి దారులకు మాత్రం ఎన్నడూ లేని విధంగా అత్యంత ధరకు అమ్ముడుపోతోంది. ఎన్టీఆర్ సినిమాలు ఎప్పుడు పలకని ధరలు ఈ సినిమా పలుకుతోంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఈ చిత్రం బిజినెస్ లో భాగం అవుతున్నారు.ఇప్పటికే ఉత్తరాంధ్ర ఏరియా హక్కులను భారీ మొత్తంలో కొనుకున్న దిల్ రాజు.. నైజాం ఏరియా హక్కులను కూడా అందుకోవాలని అనుకున్నారట. అయితే అందుకు కళ్యాణ్ రామ్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఎన్టీఆర్ జై లవకుశ సినిమా ఈ సారి నైజాం ఏరియాల్లో భారీ వసూళ్లను సాదించనుందని అంచనా వేస్తున్నారు. ఏ నిర్మాత అయినా ఆ వైపు నుంచే సినిమా కలెక్షన్స్ పై ఎక్కువ ఆశ పెట్టుకుంటాడు. అక్కడ సినిమాలకు మార్కెట్ కూడా ఆలా ఉంటుంది మరి. ఇక స్టార్ హీరోల సినిమాలైతే డిస్ట్రిబ్యూటర్ కి కాసుల వర్షాన్ని కురిపిస్తాయి. దీంతో నిర్మాత నైజాం ఏరియాలో అత్యధిక ధరకు అమ్మడానికి చూస్తాడు. అదే తరహాలో దిల్ రాజు కూడా నైజాం ఏరియాలో పంపిణీ చేసి కలెక్షన్స్ అందుకోవాలని అనుకున్నాడు కానీ జై లవకుశ చిత్ర నిర్మాత కళ్యాణ్ రామ్ దిల్ రాజు అడిగిన రేటుకు ఇవ్వలేదట. ఒక్కసారిగా 20 కోట్లకు అమ్మదలచుకున్నానని చెప్పడంతో.. దిల్ రాజు కొంచెం ఒప్పించే ప్రయత్నం చేశాడట.. కాని సక్సెస్ అవ్వలేదు.

ఎందుకంటే ఇంతకుముందు జనతా గ్యారేజ్ సినిమా నైజాం ఏరియాలో 16 కోట్లను మాత్రమే రాబట్టగలిగింది. అయితే కొరటాల శివ డైరెక్షన్ కూడా అందుకు ఉపయోగపడింది. కానీ ఈ సారి బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతుండడంతో కాస్త ఆలోచించమని దిల్ రాజు చెప్పారట. కానీ కళ్యాణ్ రామ్ మాత్రం అందుకు ఒప్పుకోకపోవడంతో మాట్లాడకుండా వెనుదిరిగాడట. సినిమా మీద కళ్యాణ్ రామ్ నమ్మకం బాగానే పెట్టుకున్నాడు మరి అతనికి ఏ స్థాయిలో లాభాలని తెచ్చిపెడుతుందో చూడాలి.