Begin typing your search above and press return to search.

మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు

By:  Tupaki Desk   |   27 Jun 2017 4:48 AM GMT
మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు
X
దువ్వాడ జగన్నాథం మూవీ సాధిస్తున్న కలెక్షన్స్ ఇండస్ట్రీ వర్గాలను విస్మయానికి గురి చేస్తున్నాయి. తొలి వారంతోనే 100 కోట్ల గ్రాస్ మార్క్ ను డీజే అధిగమించడం ఖాయమనే అంచనాలను చెప్పిన దిల్ రాజు.. మొదటగా బన్నీతో మాస్ సినిమా చేసినందుకు థ్యాంక్స్ చెప్పాడు.

'బన్నీ ఎప్పుడూ నన్ను ఆట పట్టించేవాడు. మన బ్యానర్ లో మాస్ సినిమా మీరు తియ్యలేరు అనేవాడు. కానీ 25వ సినిమా.. బన్నీ హైయెస్ట్ గ్రాసర్.. మాస్ సినిమా అయింది. ఇంపాజిబుల్ ని పాజిబుల్ చేశారు బన్నీ- హరీష్ శంకర్' అంటూ సంతోషం వెలిబుచ్చిన దిల్ రాజు.. ఇటు సినిమా సక్సెస్ గురించి చెబుతూనే.. మరోవైపు తెలుగు సినిమాపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారంపై కూడా స్పందించాడు. 'మా బ్యానర్ లో 25 సినిమాలు చేశాం. అందరితో చేశాను.. ఇంకా కొందరితో చేయాలి. చేస్తాం కూడా. అందరు ప్రేక్షకులకు ఒక విన్నపం.. తెలుగు సినిమా గురించి ఇవాళ బాలీవుడ్ మాట్లాడుకుంటోంది. ప్రముఖులు ట్వీట్స్ పెడుతున్నారు. డీజే మూవీ వసూళ్లను చూపిస్తూ.. క్రేజ్ ఉన్న హిందీ సినిమా ఆ స్థాయి కలెక్షన్స్ రాలేదని ట్వీట్ చేశారు. అది మన స్టామినా. మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు. ప్రతీ ఒక్క సినిమాతో మన స్టామినా పెరగాలి. ఇప్పుడు డీజే తర్వాత వచ్చే సినిమా ఇంకా ఎక్కువ వసూలు చేయాలి. అలా తెలుగు సినిమా స్టాండర్డ్ పెరగాలి. ఏ హీరో అభిమానులు కూడా మరో హీరోని తక్కువ చేసుకోవద్దు. మన సినిమా స్థాయిని పెంచుకోవాలి" అంటూ యాంటీ ఫ్యాన్స్ కు.. విమర్శలకు సూచించాడు దిల్ రాజు.

నిజానికి తెలుగులో ఫ్యాన్స్ అండ్ యాంటీ ఫ్యాన్స్ అనే నానుడి కొన్నేళ్ళుగా వస్తోంది. దాదాపు ఒక 40 ఏళ్ళు అయ్యుంటుంది. మరి ఇప్పుడు సడన్ గా మారిపోమంటే అభిమానులు మారిపోతారా? దిల్ రాజు మాటింటారా? అసలు తెలుగువారి మధ్య అంతటి ఐక్యత ఉంటే.. రాజమౌళికి పద్మశ్రీ ఇమ్మని కర్ణాటక నుండి ఎందుకు నామినేట్ చేస్తారూ.. తెలుగు బాషకు ఇంకా ప్రాచీన బాష హోదాను ఎందుకివ్వరూ?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/