Begin typing your search above and press return to search.

పాత అనుష్కనే చూపిస్తామన్న జక్కన్న

By:  Tupaki Desk   |   25 Feb 2017 6:37 AM GMT
పాత అనుష్కనే చూపిస్తామన్న జక్కన్న
X
అనుష్క అందాలపై జనాలకు మాంచి గురి ఉండేది. కేవలం ఒక సినిమా కోసం లావెక్కిపోయినపుడు ఆమె కమిట్మెంట్ పై నమ్మకం ఉండేది. కానీ సైజ్ జీరో ఇచ్చిన షాక్ దెబ్బకు.. అన్ని సిట్యుయేషన్స్ మారిపోయాయి. వీటికి తోడు రీసెంట్ గా వచ్చిన ఓం నమో వెంకటేశాయ.. సింగం3 సినిమాలు జనాలకు ఓ క్లారిటీ ఇచ్చేశాయి.

వీటన్నిటి మధ్యలో బాహుబలి దిం కంక్లూజన్ పోస్టర్ ఒక్కటే అనుష్క అభిమానులను ఆనందపరిచింది. ఆ కొంచెం కూడా ఎస్3 సినిమా రిలీజ్ తర్వాత ఆవిరి అయిపోయింది. అయితే.. బాహుబలి2 విషయంలో అసలు సీక్రెట్ చెప్పేశాడు జక్కన్న. 'బాహుబలి 2కు సంబంధించి చాలా వరకూ షూటింగ్ ముందే పూర్తి చేసేశాం. కొన్నేళ్ల క్రితమే ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడు ఆమె కొన్ని షాట్స్ కు సంబంధించిన షూటింగ్ లోనే పాల్గొంది. సైజ్ జీరో తర్వాత ఆమె సైజ్ తగ్గించుకున్నా.. బాహుబలికి కమిట్ అయినట్లుగా మాత్రం లేదు. అఅందుకే కొన్ని షాట్స్ ను మేనేజ్ చేశాం' అని చెప్పాడు రాజమౌళి.

నిజానికి రాజమౌళి చెప్పాల్సిన పనేమీ లేదు.. మూడేళ్ల క్రితం విడుదల చేసిన దేవసేన లుక్ లోనే అనుష్క ప్రాధాన్యత అర్ధమవుతుంది. కానీ బాహుబలి1 లో కనీస మాత్రం కూడా స్వీటీకి స్క్రీన్ స్పేస్ దక్కలేదు. ఇప్పుడు 2017లో చూపించబోయేవన్నీ ఆ పాత అందాలే అనే విషయంలో పెద్దగా సందేహాలు అక్కర్లేదులే!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/