చిరంజీవికి నచ్చలేదా?

Thu Jan 18 2018 22:00:13 GMT+0530 (IST)


టాలీవుడ్ లో ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం మెగాస్టార్ చిరంజీవి సైరా. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత ఆధారంగా భారీ బడ్జెట్ తో కమర్షియల్ దర్శకుడు సురేందర్ రెడ్డి ఆ కథను డైరెక్ట్ చేస్తున్నాడు. సినిమాపై అంచనాలు భరిగానే ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి తరువాత ఆ స్థాయిలో ఈ సినిమాను నిర్మించేందుకు నిర్మాత రామ్ చరణ్ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రతి సిన్ ఉన్నతంగా ఉండలని మొత్తం చిత్ర యూనిట్ వర్క్ చేస్తోంది.ఇకపోతే గత నెలలో ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని చాలా ఫాస్ట్ గా పూర్తి చేసుకుంది. అనంతరం న్యూ ఇయర్ సందర్భంగా అలాగే సంక్రాంతి వల్ల అందరు కొంచెం బ్రేక్ తీసుకొని మరికొన్ని రోజుల్లో సెకండ్ షెడ్యూల్ ని కొన్ని అటవీ ప్రాంతాలకి షిఫ్ట్ చేయడానికి సిద్దమయ్యారు. అయితే ఎవరు ఊహించని విధంగా ఇటీవల దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పిన ఒక మాటను చిరు పట్టించుకోలేదని తెలుస్తోంది. అంతే కాకుండా దర్శకుడి ఆలోచనకు చిరు ఆగ్రహం వ్యక్తం చేశారని టాక్ వినిపిస్తోంది.

కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలకు చిరుకు ప్రస్తుతం ఉన్న ఫిట్ నెస్ సరిపోదని ఇంకా బాడీని డబుల్ చేస్తే బెటర్ అని చెప్పడంతో చిరు ఒప్పుకోలేదని చిత్ర యూనిట్ నుంచి కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని ఫైట్స్ సీన్స్ ని అయితే కొంచెం భారీగా తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఆ ఫైట్ కి థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతుందట. సెకండ్ షెడ్యూల్ కోసం మొత్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యయి. ఇక సినిమాలో మెగాస్టార్ సరసన నయనతార నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే అమితాబ్ - సుదీప్ వంటి అగ్ర నటులు కూడా ఉన్నారు.