Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: ఎవ‌రికి వారే ప్ర‌త్యేకం

By:  Tupaki Desk   |   13 Oct 2019 5:30 PM GMT
టాప్ స్టోరి: ఎవ‌రికి వారే ప్ర‌త్యేకం
X
ఆ ఇద్ద‌రూ స‌మ‌కాలికులు. 90ల‌లో పోటాపోటీగా సినిమాల్లో న‌టించారు. రెండు ద‌శాబ్ధాల పాటు ఇద్ద‌రి మ‌ధ్యా పోటీ అభిమానుల్లో వాడి వేడిగా చ‌ర్చ‌కు తావిచ్చింది. ఫ్యానిజాన్ని ప‌రాకాష్ట‌కు చేర్చ‌డంలో మెగా బాస్ చిరంజీవి .. న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ ట్రెండే వేరు. క‌మ‌ర్షియ‌ల్ హీరోయిజంలోనూ దిగ్గాజాలు అనిపించారు. అయితే ఆ ఇద్ద‌రూ ఎప్పుడూ ఒక‌టేనా? అంటే కానే కాదు. వ్య‌క్తిగత విష‌యాల్లో అలాగే కెరీర్ సెల‌క్ష‌న్ విష‌యంలో ఎవ‌రి పంథా వారిది. ఇంకా చెప్పాలంటే ఎవ‌రికి వారే య‌మునా తీరే!

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ అస‌లు స్టార్ డైరెక్ట‌ర్ కోసం వేచి చూడాల‌ని అనుకోరు. ద‌ర్శ‌కుడితో కుదిరితే ప్రాజెక్టు ప‌ట్టాలెక్కించేస్తారు. నిర్ణ‌యాలు వేగంగా తీసుకుంటారు. ఒక‌సారి సెలెక్టెడ్ అంటే అస‌లు ఎవ‌రినీ కేర్ చేయ‌రు. హిట్స్ ఫ్లాప్స్ గురించి దీర్ఘంగా ఆలోచించ‌రు. క‌ల‌త‌కు గుర‌వ్వ‌రు. ఒక్కోసారి ద‌ర్శ‌కుడి ఎంపిక విష‌యంలో స‌డెన్ డెసిష‌న్స్ ఉంటాయి. ద‌ర్శ‌కుడితో కుదిరితే చాలు ప్రాజెక్టు ఓకే అయిపోతుంది.

అయితే చిరు మాత్రం అలా కాదు. ద‌ర్శ‌కుడి ఎంపిక‌ విష‌యంలో చాలా ఎక్కువ జాగ్ర‌త్త‌గా ఉంటారు. ఖైదీనంబ‌ర్ 150తో రీఎంట్రీ ఇచ్చాక‌.. ప్ర‌స్తుతం సక్సెస్ లో ఉన్న డైరెక్ట‌ర్ల‌కు మాత్ర‌మే ఓకే చెబుతున్నారు. ష్యూర్ షాట్ గా హిట్లు కొట్టే వారికే ఛాన్సులిస్తున్నారు. సురేంద‌ర్ రెడ్డి అద్భుత‌మైన హిట్టు తీశాకే అత‌డికి అవ‌కాశం ఇచ్చారు. ఆ త‌ర్వాత కూడా వ‌రుస స‌క్సెస్ ల‌తో జోరుమీదున్న కొర‌టాల‌కు అవ‌కాశం ఇచ్చారు. ఇక ఇప్పుడు సుకుమార్ కి లూసిఫ‌ర్ రీమేక్ ఛాన్స్ ఇచ్చార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. చిరు క్యూ చూస్తుంటే అంద‌రూ టాప్ రేంజు డైరెక్ట‌ర్లే లైన్ లో ఉన్నారు.

ఈ ఏజ్ లో కూడా ఎంతో జాగ్ర‌త్త‌గా ఉంటున్నారు. ఆయ‌న స్టార్టింగ్ కెరీర్ లో ఎలా ఉండేవారో ఇప్ప‌టికీ అలానే ఉన్నారు. ప్ర‌తిదీ ఆచితూచి నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ది బెస్ట్ డైరెక్ట‌ర్స్ అంద‌రినీ ఎంపిక చేసుకుని న‌వ‌త‌రం హీరోల‌తో పోటీగా చిరు రేస్ లో ఉన్నారు. అస‌లు అభిమానుల‌కు ఫ‌లానా త‌ప్పు చేశారు బాసూ అని ఫిర్యాదు చేయ‌డానికి ఛాన్సే లేనంత‌గా భ‌రోసాని ఇస్తున్నారు. ఆ ఇద్ద‌రికి మ‌ధ్య వేరియేష‌న్ స్ప‌ష్టంగా అర్థ‌మైంది క‌దూ?