Begin typing your search above and press return to search.

జెర్సీ పిల్లల అసలు కథ ఇది

By:  Tupaki Desk   |   20 April 2019 7:20 AM GMT
జెర్సీ పిల్లల అసలు కథ ఇది
X
నిన్న విడుదలైన జెర్సీలో హీరో పాత్ర పేరు అర్జున్. కొడుకు పేరు నాని. వినేందుకు కాస్త వెరైటీగా ఉన్నా ఇదే భలేగా కనెక్ట్ అయ్యింది సినిమాలో. చిన్న వయసుగా చేసిన నాని పెద్దయ్యాక ఉద్యోగం చేస్తున్న నానిగా ఇద్దరూ పర్ఫెక్ట్ గా మ్యాచ్ కావడంతో వాళ్ళు ఎవరా అనే సందేహం ప్రేక్షకులకు కలిగింది.

విషయానికి వస్తే ఆర్ధిక స్తోమత లేని నాన్నను జెర్సీ కొనివ్వమని అడిగే పదేళ్ళ అబ్బాయిగా నటించింది రోనిత్ కమ్రా. ఢిల్లీలో ఉండే రోనిత్ పిన్న వయసు మోడల్. ఫ్యాబ్ ఇండియా డ్రెసెస్ తో పాటు ఇప్పటికే చాలా బ్రాండ్లు ఎండార్స్ చేశాడు. ఆ అనుభవమే జెర్సీలో పాత్రను పండించడానికి చక్కగా ఉపయోగపడింది. ముఖ్యంగా బర్త్ డే సీన్ లో నువ్వు కొట్టావంటే ఎవరు నమ్మరు నాన్న అని చెప్పే సీన్లో కంటనీరు తెప్పిస్తాడు

ఇక పెద్దయ్యాక కనిపించే నానిగా నటించింది హరీష్ కళ్యాణ్. తమిళ ఆర్టిస్ట్. చిన్న పాత్రల ద్వారా అక్కడివారికి సుపరిచితుడే. నాని స్వయంగా ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పడం విశేషం. సినిమా మొదట్లో క్లైమాక్స్ లో కేవలం రెండు ఎపిసోడ్స్ లో కనిపించే పాత్రే అయినప్పటికీ హరీష్ కళ్యాణ్ తన ఐడెంటిటీ నిలబెట్టుకున్నాడు. జెర్సీ వల్ల ఈ ఇద్దరికీ ఇప్పుడు మంచి గుర్తింపు వచ్చింది.

అర్జున్ పాత్ర ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అంతే సమానంగా రోనిత్ హరీష్ కళ్యాణ్ లు సైతం తమ వంతు తోడ్పాటు అందించారు. రోనిత్ కు అప్పుడే డిమాండ్ పెరిగిందని ఇన్ సైడ్ టాక్. టాలెంట్ ఉన్న చైల్డ్ ఆర్టిస్టులు దొరకడమే కష్టం. అలాంటిది ప్రూవ్ చేసుకున్న వాళ్ళకు కాకుండా ఆఫర్స్ ఇంకెవరికి వస్తాయి. అదే టైం మహత్యం అంటే