Begin typing your search above and press return to search.

ఆ ఎముకల రూపం ఫోటోషాపింగా!?

By:  Tupaki Desk   |   10 Feb 2016 7:30 PM GMT
ఆ ఎముకల రూపం ఫోటోషాపింగా!?
X
రణ్ దీప్ హుడా ఇప్పుడో సినిమా చేస్తున్నాడు. సరబ్ జీత్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా.. భారతీయ గూఢచారి అంటూ పాక్ జైల్లోనే జీవితం మొత్తం గడిపేసిన సరబ్ జీత్ సింగ్ జీవితమే. ఈ మూవీ కోసం ఎముకల గూడు మాదిరిగా తయారైన ఓ ఫోటోను రణ్ దీప్ షేర్ చేసి.. ఇప్పుడు బరువు పెరిగానని చెప్పాడు.

ఓ పాత్ర కోసం 18 కిలోలు తగ్గిపోయి, కండలు తిరిగిన దేహాన్ని ఎముకల గూడుగా మార్చేశానన్నది రణ్ దీప్ హుడా చెప్పిన మాట. దీంతో ఈ హీరో కమిట్ మెంట్ పై బోలెడన్ని ప్రశంసలు వచ్చాయి. కానీ ఈ ఫోటో ఫేక్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి అవతారంలో ఇప్పటివరకూ ఎక్కడా ఈ హీరో కనిపించలేదు. రీసెంట్ గా కనిపించిన ప్రతీ చోటా సలక్షణంగా ఉన్నాడు. తిండి తక్కువగా తింటూ ఇలా మారేందుకు అవకాశం ఉంది కానీ.. అందుకు బోలెడన్ని ఎక్సర్ సైజులు చేయాలి. కానీ చాలా కాలం తర్వాత మళ్లీ జిమ్ కెళ్తున్నాని తనే చెప్పాడు రణ్ దీప్. అలాగే సగం ఫోటోను తప్ప.. తన పూర్తి పిక్చర్ ను ఎక్కడా పోస్ట్ చేయలేదు.

అసలు ఇలా ఫోటో ఇచ్చే బదులు తనే అందరికీ కనిపించి ఉంటే ఇంకా ఎఫెక్టివ్ గా ఉండేది. కానీ ఆ ప్రయత్నం కూడా చేయలేదు రణ్ దీప్ హుడా. పైగా.. ఫోటోని జాగ్రత్తగా పరిశీలిస్తే.. ఛాతీ భాగంలో ఎముకలుంటాయి కానీ.. బైసెప్స్ మాత్రం ధృడంగానే ఉన్నాయనే విషయం అర్ధమవుతుంది. ఇదంతా చూస్తుంటే.. రణ్ దీప్ హుడా ఫోటోషాప్ తో గిమ్మిక్ చేసి ప్రచారం పొందేసే స్కెచ్ వేశాడని అంటున్నారు.