Begin typing your search above and press return to search.

బంజారాహిల్స్‌ లో డిక్టేటర్‌ హల్‌ చల్‌

By:  Tupaki Desk   |   8 Oct 2015 5:30 PM GMT
బంజారాహిల్స్‌ లో డిక్టేటర్‌ హల్‌ చల్‌
X
నటసింహం బాలకృష్ణ.. 99వ సినిమాని శరవేగంగా చేసేస్తున్నాడు. శ్రీవాస్ డైరెక్షన్ లో చేస్తున్న డిక్టేటర్ మూవీ.. ప్రస్తుతం హైద్రాబాద్ లోని బంజారా హిల్స్ లో షూటింగ్ జరుపుకుంటోంది. కామెడీ టైమింగ్ తో కేక పెట్టించే బాలకృష్ణ.. పలు కామెడీ సన్నివేశాల్లో పాల్గొన్నారు. ఓ సూపర్ మార్కెట్ సన్నివేశాలను రీసెంట్ గా తెరకెక్కించారు. వీటి అవుట్‌ పుట్‌ అదిరిపోయినట్లు తెలుసో్తంది.

దీనికి ముందు యూరోప్ దేశాలు కూడా చుట్టొచ్చేశాడు. బల్గేరియా - పోలండ్ దేశాల్లోని అందమైన లొకేషన్ లలో సాంగ్స్ తో పాటు, పలు సీన్లను కూడా షూటింగ్ నిర్వహించారు. డిక్టేటర్ ను శరవేగంగా కంప్లీట్ చేసి.. వందో సినిమాకు సంబంధించిన డీటైల్స్ అనౌన్స్ చేయాలని ఉత్సాహంగా ఉన్నాడు బాలకృష్ణ. ఈ మూవీలో బాలయ్య డ్యుయల్ రోల్ పోషిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే ఏం లేదు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి, వినాయక చవితి రోజున విడుదల చేసే గం గం గం గణేశా సాంగ్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

లయన్ డిజాస్టర్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో.. డిక్టేటర్ పై నందమూరి అభిమానులు బాగానే ఆశలు పెట్టుకున్నారు. ఫ్యాన్స్ ఆశలను, అంచనాలను అందుకునేలా బంపర్ హిట్ ఇస్తానంటున్నాడు డైరెక్టర్ శ్రీవాస్.