బీచ్ లో చెత్త ఏరుతున్న హీరోయిన్

Wed Sep 13 2017 15:08:32 GMT+0530 (IST)

హైద్రాబాద్ బ్యూటీ దియా మీర్జాకు బోలెడంత ఇమేజ్ ఉంది. మిలీనియం ఇయర్ లో మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న ఈ బ్యూటీ.. అక్కడి నుంచి తన కెరీర్ ను బాగానే కంటిన్యూ చేసింది. అయితే.. ఆశించిన స్థాయిలో బాలీవుడ్ లో తన కెరీర్ ను మలుచుకోలేకపోయినా.. చెప్పుకోదగిన సంఖ్యలో సినిమాలలో నటించింది.ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. మూడేళ్ల క్రితమే పెళ్లి చేసుకుని సెటిల్ అయిన ఈ సుందరి.. సామాజిక సేవలో కూడా ముందుంటుంది. రీసెంట్ గా ముంబైలో గణేష్ చతుర్ధి సందర్భంగా అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే గణేష్ నిమజ్జనం కూడా పూర్తయిపోగా.. ముంబై బీచులు అన్నీ విపరీతమైన చెత్తా చెదారంతో నిండిపోయాయి. దీంతో తనకు తనే చొరవ తీసుకుని ఈ చెత్తను శుభ్రం చేసే పనిలో నిమగ్నమై పోయింది దియా మీర్జా. ఇందుకోసం తనే ఇనీషియేట్ తీసుకుని పలువురు విద్యార్ధులతో కలిసి శుభ్రం చేసే పనిలో నిమగ్నమై పోయింది.

అందాల తార అయినా సరే.. సెలబ్రిటీ స్థాయి ఉన్నా సరే.. ఇలా చెత్తలో మునిగితేలుతూ తనంతట తనే ఓ మంచి కార్యక్రమాన్ని ఆచరిస్తున్న దియా మీర్జాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. స్వచ్ఛ్ భారత్ అంటూ ఫోటోల కోసం పోజులు ఇచ్చే సెలబ్రిటీలు మన చుట్టూ ఉన్న కాలంలో.. స్వయంగా చొరవ తీసుకుని మరీ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్న దియా మీర్జాను ప్రశంసించాల్సిందే.