Begin typing your search above and press return to search.

స్టంట్స్ అన్నీ రియల్ గా చేసినట్లున్నాడే

By:  Tupaki Desk   |   3 Dec 2016 4:47 PM GMT
స్టంట్స్ అన్నీ రియల్ గా చేసినట్లున్నాడే
X
రామ్ చరణ్ మూవీ ధృవ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్ విషయంలో.. యూనిట్ కొత్త కొత్త రూట్స్ వెతుకుతోంది. మేకింగ్ వీడియోల పేరుతో హంగామా ఎప్పుడూ చూసేదే అయినా.. ధృవ కోసం ఒక్కో జోనర్ ని ఒక్కోసారి పరిచయం చేస్తున్నారు. సాంగ్ ప్రోమోస్ తో స్టార్ట్ చేసి.. ఇప్పటికే ధృవ ట్రైలర్ కూడా వదిలేశారు. డిసెంబర్ 4న ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్‌గా జరగనుండగా.. ముందు రోజు ఓ మేకింగ్ వీడియో ఇచ్చింది ధృవ టీం.

ధృవ ఒక యాక్షన్ థ్రిల్లర్ అనే సంగతి తెలిసిందే. అందుకే ఫక్తు యాక్షన్ సీన్స్ పిక్చరైజేషన్ తో ఓ మేకింగ్ వీడియో ఇచ్చారు. ఫైట్స్ విషయంలో ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేయడం చెర్రీకి అసలే మాత్రం ఇష్టం లేని పని. అందుకే ఫైట్ సీన్స్ విషయంలో డూప్స్ లాంటివి అసలు వాడడు. పైగా రిస్కీ స్టంట్స్ కూడా కనీసం చిన్నపాటి ప్రొటెక్షన్ కూడా లేకుండా చెర్రీ ఏ రేంజ్ లో చేసేస్తున్నాడు ఈ మేకింగ్ వీడియోలో కనిపిస్తుంది.

పోలీస్ ఆఫీసర్ గెటప్ లో చెర్రీ అండ్ టీం సూపర్బ్ గా ఉంది. ఇక నవదీప్ తో పాటు ధృవ ఫ్రెండ్స్ గా నటించిన వాళ్లందరూ మాంచి టీంగా భలే సెట్ అయిపోయారు. మధ్యలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా పరుగులు పెట్టేస్తూ తన వంతు పాత్ర పోషిస్తోంది.