Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: ఎందుకురా మర్డర్ చేశావ్?

By:  Tupaki Desk   |   19 Oct 2017 5:06 AM GMT
టీజర్ టాక్: ఎందుకురా మర్డర్ చేశావ్?
X
చిన్న సినిమాలైనా ఈ మధ్య మంచి కథాంశంతో వచ్చి సూపర్ హిట్ అవుతున్నాయి. కాన్సెప్ట్ బావుంటే తారాగణం చిన్నదైనా ప్రేక్షకులు పట్టించుకోకుండా సినిమాను చూడటానికి వెళుతున్నారు. ఎక్కువగా థ్రిల్లర్ - హర్రర్ కాన్సెప్ట్స్ తో వచ్చి చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు భారీ వసూళ్లను రాబడుతున్నాయి.

అదే తరహాలో మరొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చిత్రం తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యింది. సింగర్ చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ హీరోగా పావని గంగిరెడ్డి హీరోయిన్ గా నటిస్తోన్న చిత్రం ద్రుష్టి. అలాగే వెన్నల కిశోర్ కూడా మరొక ముఖ్య పాత్రలో కనిపిస్తున్నాడు. దీపావళి సందర్బంగా చిత్ర యూనిట్ రీసెంట్ గా టీజర్ ని రిలీజ్ చేసింది. టీజర్ ని చూస్తుంటే క్రైమ్ స్టోరీ లనే ఉందని అనిపిస్తోంది. అలాగే కామెడీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 'ఎందుకురా మర్డర్ చేశావ్?' 'ప్రూఫ్‌ లేకుండా మాట్లాడటం కరక్టు కాదు సార్' అన డైలాగులు ఇన్ స్టంట్ గా కనక్ట్ అవుతున్నాయి.

దీపావళి రోజున దాదాపు చాలా సినిమాలు ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశాయి కానీ వీరు మాత్రం ఏకంగా టీజర్ నే రిలీజ్ చేశారు. అలాగే త్వరలో ట్రైలర్ ని రిలీజ్ చేస్తామని కూడా టీజర్ లోనే చెబుతున్నారు. ప్రస్తుతం ఈ టీజర్ కాస్త ఆసక్తిని రేపుతోంది. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మోహన్ నిర్మిస్తున్నారు. నరేష్ కుమారన్ సంగీతాన్ని అందిస్తున్నారు.