దించాక్ పూజ వస్తోందోచ్!!

Fri Oct 20 2017 09:59:38 GMT+0530 (IST)

యుట్యూబ్ లో వీడియోలు చూసేవారికి బాగా దగ్గరైన పేరు 'దించాక్ పూజ'. ఆమె పేరు చెప్పగానే చాలామంది తిట్టిపోస్తారు కాని.. అమాయత్వంతో అతి తెలివితో ఆమె చేసే వీడియోలను మాత్రం చూడకుండా ఉండరు. ముఖ్యంగా సెల్ఫీ లేలేనా ఆజ్.. దిలోంకా షూటర్ అంటూ సాగే పాటలతో దించాక్ పూజ ఇండియావైడ్ వైరల్ అయిపోయింది.కాని షాకింగ్ విషయం ఏంటంటే.. ఆ మధ్యన ఆమె యుట్యూబ్ ఛానల్ ను బ్లాక్ చేశారు. ఎందుకు  అంటే.. ఆ ఛానల్ తాలూకు కాపీరైట్లు వేరే ఎవరిదగ్గరో ఉన్నాయట. కాని చిన్నప్పటి నుండి హీరోయిన్ అవ్వాలని కలలు కన్న పూజ.. అప్పటికే తన కంటెంట్ లేని కామెడీ వీడియోలతో బాగా పాపులర్ అవ్వడంతో.. ఏకంగా టివి ఛానళ్ళలో ఆమె ఇంటర్యూలు తెగ వచ్చేశాయి. కట్ చేస్తే.. ఇప్పుడు బిగ్ బాస్ 11లో ఆమె వైల్డ్ కార్డ్ కంటెస్టంట్ గా అడుగుపెట్టబోతోంది. ఆల్రెడీ ఈసారి హిందీ బిగ్ బాస్.. హీనా ఖాన్.. అర్షి ఖాన్ వంటి పాపులర్ హాటీలతో నిండిపోయింది. దానికితోడు వారు చేస్తున్న పాలిటిక్స్ అన్నీ ఇన్నీ కాదు. ఈ సమయంలో దించాక్ పూజ కూడా వస్తోందంటే నార్త్ లో జనాలకు మామూలు కిక్కివ్వట్లేదులే.

నిజానికి తెలుగు బిగ్ బాస్ లో మాత్రం ఇలాంటి క్రేజ్ ఉన్న క్రేజీ స్టార్లు ఎవ్వరూ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వలేకపోయారు. నవదీప్ అండ్ దీక్షా పంక్త్ అప్పట్లో ఇంత హైప్ తీసుకురాలేకపోయారు. కాని దించాక్ పూజ విషయంలో మాత్రం.. బిగ్ బాస్ ఆర్గనైజర్లు రేటింగుల మేళా చేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు తెలుసా!!