Begin typing your search above and press return to search.

బాలీవుడ్లో ధనుష్ మరో సెన్సేషన్

By:  Tupaki Desk   |   24 July 2016 9:41 AM GMT
బాలీవుడ్లో ధనుష్ మరో సెన్సేషన్
X
అప్పటికి ధనుష్ గురించి బాలీవుడ్డోళ్లకు పెద్దగా తెలియదు. ‘ఆడుగళం’ సినిమాతో జాతీయ అవార్డు అందుకుని ఉన్నప్పటికీ ధనుష్‌ ను తక్కువగానే చూశారు అక్కడి వాళ్లు. ‘తను వెడ్స్ మను’ ఫేమ్ ఆనంద్.ఎల్.రాయ్ ఏరి కోరి ధనుష్ తో ‘రాన్ జానా’ సినిమా తీయడమేంటో బాలీవుడ్డోళ్లకు అర్థం కాలేదు. హిందీ ప్రేక్షకులు ధనుష్ ను ఏమాత్రం ఓన్ చేసుకుంటారో అని అందరూ సందేహించారు. తీరా సినిమా విడుదలయ్యాక అర్థమైంది ధనుష్ అంటే ఏంటో. ఒక్కసారి హిందీ ప్రేక్షకుల మనసుల్లోకి దూసుకెళ్లిపోయాడు ఈ బక్క హీరో. ఆ తర్వాత ‘షమితాబ్’ సినిమాతో మరోసారి ఆశ్చర్యపరిచాడు. ఆ సినిమా ఫ్లాప్ అయినా సరే.. ధనుష్ నటనకు మాత్రం గొప్ప ప్రశంసలు దక్కాయి.

ఈసారి కొంచెం గ్యాప్ తీసుకుని మరో సెన్సేషనల్ మూవీతో బాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు ధనుష్. మణిరత్నం ఆల్ టైం క్లాసిక్ అగ్నినక్షత్రం (తెలుగులో ఘర్షణ) హిందీ రీమేక్ లో ధనుష్ ఇద్దరు హీరోల్లో ఒకడిగా నటిస్తున్నాడు. మణిరత్నం శిష్యుడైన బిజాయ్ నంబియార్.. అగ్నినక్షత్రం విడుదలైన 28 ఏళ్లకు ఆ సినిమాను రీమేక్ చేయబోతున్నాడు. ఇప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా మార్పులు చేసి.. హిందీ ప్రేక్షకుల అభిరుచి తగ్గట్లుగా స్క్రిప్టు తీర్చదిద్దాడట బిజాయ్. ముందు ఈ సినిమాలో హర్షవర్ధన్ రాణె.. నిక్కీ కౌషల్ హీరోలుగా నటిస్తారని అన్నారు. ఐతే కొన్ని కారణాల వల్ల నిక్కీ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆ పాత్రను ధనుష్‌ తో చేయించబోతున్నారు. బహుశా ధనుష్.. ఒరిజినల్ లో కార్తీక్ చేసిన పాత్ర పోషించే అవకాశముంది. మరి ఈసారి ధనుష్ తన ముద్ర ఎలా చూపిస్తాడో చూద్దాం.