Begin typing your search above and press return to search.

పెటాపై ధ‌నుష్ ఫ‌టాఫ‌ట్ కామెంట్స్!

By:  Tupaki Desk   |   20 Jan 2017 4:40 PM GMT
పెటాపై ధ‌నుష్ ఫ‌టాఫ‌ట్ కామెంట్స్!
X
సినీతార‌ల‌కు ఏదైనా అవార్డు రావ‌డ‌మే ఆల‌స్యం.. దాని గురించి గొప్ప‌గా చెప్పుకుంటూ ఉంటారు. సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా కూడా అందుకున్న అవార్డుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ, ఇందుకు భిన్నంగా తాను అందుకున్న అవార్డు గురించి నెగెటివ్ గా మాట్లాడుతున్నాడు త‌మిళ హీరో ధ‌నుష్‌. గ‌తంలో అందుకున్న అవార్డు గురించి ఇప్పుడు ఇలా చింతించాల్సిన ప‌రిస్థితి ఎందుకొచ్చిందంటే... జ‌ల్లిక‌ట్టుపై నిషేధం!

జ‌ల్లిక‌ట్టుపై ఉన్న అడ్డుక‌ట్ట‌ను తొల‌గించాలంటూ త‌మిళ సోద‌రులు ఆందోళ‌న చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌ర‌త‌రాలుగా వ‌స్తున్న సంప్ర‌దాయాన్ని వ‌దులుకునే ప్ర‌స‌క్తే లేదంటూ త‌మిళ‌నాడు ఉద్య‌మిస్తోంది. జ‌ల్లిక‌ట్టు మ‌ద్ద‌తుదారులంతా తీవ్ర ఆందోళ‌న‌లు చేప‌డుతున్నారు. సుప్రీం కోర్టు విధించిన నిషేధాన్ని వెంట‌నే ఎత్తేయాలంటూ గ‌ళ‌మెత్తుతున్నారు. ఈ నేప‌థ్యంలో త‌మిళ హీరో ధ‌నుష్ కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. మూగ జీవాల సంర‌క్ష‌ణ సంస్థ ‘పెటా’ మీద సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. అంతేకాదు... గ‌తంలో ఆ సంస్థ త‌న‌కు ఇచ్చిన అవార్డుపై కూడా కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. పెటా చొర‌వ‌తోనే జ‌ల్లిక‌ట్టుపై సుప్రీం కోర్టు నిషేధం విధించింది క‌దా! దీంతో ధ‌నుష్ ఆ సంస్థపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.

త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ శాఖాహారి. అందుకే, అత‌డికి 2012లో పెటా సంస్థ ‘హాటెస్ట్ వెజిటేరియ‌న్‌’ అంటూ ఒక అవార్డును ప్ర‌దానం చేసింది. పెద్ద ఎత్తున ధ‌నుష్ ను స‌త్క‌రించింది. అయితే, ఆ అవార్డును అప్పుడు తీసుకోవ‌డం అవ‌మానంగా భావిస్తున్నానంటూ ధ‌నుష్ వ్యాఖ్యానించాడు. పెటాతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేశాడు. త‌న‌కే కాదు... త‌న కుటుంబ స‌భ్యుల‌కు కూడా పెటాతో సంబంధాలు లేవ‌ని చెప్పాడు. ఎన్నోయేళ్లుగా ఓ సంప్ర‌దాయంగా వ‌స్తున్న జ‌ల్లిక‌ట్టుపై నిషేధం త‌గ‌ద‌నీ, నిర్వ‌హ‌ణ‌కు అనుమతులు ఇవ్వాలంటూ ఈ సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వానికి ధ‌నుష్ విజ్ఞ‌ప్తి చేశాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/