Begin typing your search above and press return to search.

ఆ ఫ్లాపులకు కూడా సీక్వెల్సా?

By:  Tupaki Desk   |   27 Feb 2017 3:25 PM GMT
ఆ ఫ్లాపులకు కూడా సీక్వెల్సా?
X
తమిళనాట భలే వెరైటీ స్టోరీలే కాదు..భలే వెరైటీ ఐడియాలను కడా ఫాలో అవుతుంటారు. అందులో ముఖ్యంగా సూపర్ స్టార్లు అనిపించుకున్న హీరోలకు కూడా కెరియర్లో ఎక్కువ ఫ్లాపులే ఉండటం ఒక విశేషం. అదిగో ధనుష్‌ పరిస్థితి కూడా అంతే. ఎంత వైవిధ్యభరితమైన సినిమాలు చేసినా కూడా.. ఫ్లాపులు మాత్రం చాలానే ఉన్నాయి.

ఇప్పుడు అతి పెద్ద కామెడి ఏంటంటే.. మనోడు ఈ మధ్య కాలంలో వచ్చిన ఫ్లాపు సినిమాలకు కూడా సీక్వెల్స్ చేసేస్తున్నాడు. అదిగో మొన్ననే విఐపి సినిమాకు సీక్వెల్ మొదలెట్టాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాబట్టి నో ప్రాబ్లమ్. అయితే కోడి అండ్ మారి సినిమాలకు కూడా ధనుష్‌ సీక్వెల్స్ మొదలెడుతున్నాడు తెలుసా? మారి సినిమా నిజానికి అట్టర్ ఫ్లాపైంది. అనిరుధ్ మ్యూజిక్ తప్పిస్తే సినిమాలో మ్యాటర్ లేదు. ఇక కోడి సినిమాలో త్రిష నెగెటివ్ రోల్ సూపర్ అన్నారు కాని.. అసలు సినిమాకు డబ్బులు మాత్రం పెద్దగా రాలేదనేది బాక్సాఫీస్ టాక్. కాని ఆ రెండు సినిమాలకూ ఇప్పుడు సీక్వెల్స్ చేస్తున్నాడు సూపర్ స్టార్ అల్లుడు.

నిజానికి హిట్టు అయిన సినిమాలకు సీక్వెల్స్ చేస్తేనే వర్కవుట్ కావట్లేదు.. మరి యావరేజ్ అండ్ ఫ్లాప్ సినిమాలకు సీక్వెళ్ళు చేయడంలో ధనుష్‌ లాజిక్ ఏంటంటారు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/