Begin typing your search above and press return to search.

ఫ్లాపు సినిమా రీమేక్ ఏంటి నానా?

By:  Tupaki Desk   |   28 July 2017 6:48 AM GMT
ఫ్లాపు సినిమా రీమేక్ ఏంటి నానా?
X
గత కొంత కాలంగా హిందీలో మన సౌత్ సినిమాల హవా మొదలైంది. తమిళ్ తెలుగులో బాగ హిటైన సినిమాలును బాలీవుడ్ లో కూడా నిర్మించి హిట్లు కొడుతున్నారు అక్కడ హీరోలు. మన కథకు వాళ్ళ స్టైల్ మేకింగ్ జతచేసి బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్లు రాబట్టుకొంటున్నారు. అప్పుడు అప్పుడు వాళ్ళ కథలును కూడ మనం అరువు తెచ్చుకుంటాం అనుకోండి. ఇప్పుడు కూడ ఒక సౌత్ యంగ్ హీరో ఒక హిందీ సినిమాను తమిళ్లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.

ధనుష్ తమిళ్ హీరో అయన ఇప్పుడు నేషనల్ హీరో అయిపోయాడు. తెలుగులో రఘువరన్ బి.టెక్ తో హిందీలో కొలవరి డి పాటతో ఫేమస్ అయ్యాడు. ఆ పాట తరువాత కూడ ధనుష్ రెండు హిందీ సినిమాలలో హీరోగా కూడా చేశాడు. ఇప్పుడు వి‌ఐ‌పి 2 కూడ హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేయబోతున్నారు. ఈ సంధర్భంగా ధనుష్ ఒక నేషనల్ మీడియా ఇంటర్వ్యూ లో ఒక ప్రశ్నకు జవాబుగా “ నాకు ఎప్పటి నుండో బర్ఫీ సినిమాను తమిళ్లోకి రీమేక్ చేయాలని ఉంది. కుదిరితే ఆ సినిమాలో నేనే హీరోగా నటిస్తా. ఈ సినిమాలో రణబీర్ కపూర్ నటన అద్భుతంగా ఉంది. నాకు చాలా ఇష్టం ఆ సినిమా అంటే'' అని చెప్పాడు.

2012లో విడుదలైన బర్ఫీ రణబీర్ కపూర్ కు పేరు తెచ్చింది కాని.. కమర్షియల్ గా డిజాష్టర్. ఇందులో రణబీర్ మూగ చెవిటి వాడి గా నటించాడు. మరి ధనుష్ కూడ అమితాబ్ బచ్చన్ తో కలిసి షమితాభ్ అనే హిందీ సినిమాలో మూగ చెవిటి వాడిగా నటుడు కావాలి అనుకునే పాత్రలో అందరినీ మెప్పించాడు. అదే క్యారక్టర్ తో ఉన్న బర్ఫీ మీద ఎందుకు ఆసక్తి చూపిస్తున్నాడో తెలియటం లేదు ఇప్పుడు. పైగా ఫ్లాప్ సినిమాను రీమేక్ చేయడమేంటి? ఏంటో ఈ కుర్రాడు.. అతికి బ్రాండ్ అంబాసిడర్ అనుకుంట!!