బాబు.. కాన్ఫిడెన్స్ ఏది నానా??

Wed Aug 23 2017 22:50:41 GMT+0530 (IST)

ఈ శుక్రవారం మనం చూడబోతున్న సినిమాల్లో రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో గురువారం వచ్చేస్తున్న 'వివేకం' సినిమా ఒకటైతే.. శుక్రవారం వస్తున్న 'విఐపి 2' సినిమా ఒకెత్తు. ఈ రెండు సినిమాలూ కూడా అస్సలు తెలుగులో ఏ మాత్రం మార్కెట్ లేని హీరోల సినిమాలు. అయితే వీటిలో ధనుష్ సినిమా గురించి కాస్త స్పెషల్ గా చెప్పుకోవాల్సిందే.నిజానికి 'విఐపి 2' సినిమాకు తమిళంలో భీభత్సమైన హిట్ టాక్ ఏమీ రాలేదు. అలాగని అట్టర్ ఫ్లాప్ టాక్ కూడా రాలేదులే. ఏదో అలా అలా పర్లేదులే అనే తరహాలో సినిమా ఆడేస్తుంది తమిళ మార్కెట్ దగ్గర. అయితే ఈ సినిమాను గతంలో ఆగస్టు 11న రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు తెలుగు ప్రమోషన్లలో ధనుష్ ఎక్స్ ప్రెషన్లు చూడాలి. ఎందుకంటే అప్పట్లో చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తూ ఒక రకమైన గర్వాన్ని ప్రదర్శించాడు. ఒక ఇంటర్యూ మధ్యలో లేచిపోయినంత పనిచేశాడు. స్టుపిడ్ క్వశ్చన్లు అన్నాడు. కాని ఇప్పుడు తన సినిమా స్థాయి ఏంటో తెలిసిపోవడంతో.. అస్సలు మనోడు ఏమాత్రం గర్వం లేకుండా బిహేవ్ చేస్తున్నాడు. కాకపోతే కాన్ఫిడెన్స్ కూడా చూపించట్లేదు అంటున్నారు మీడియా జనాలు.

మొత్తానికి విఐపి 2 సినిమా రిజల్ట్ అక్కడ తెలిసిపోయినా కూడా మనోడు మరోసారి తెలుగులో కూడా ప్రమోట్ చేయడం.. ప్రొడ్యూసర్ గా తాను ఎలా ఆలోచిస్తాడో తెలిసిపోయింది. మన తెలుగు హీరోలు కూడా తమరి దగ్గర మిత్రులే ప్రొడ్యూస్ చేసినప్పుడు ఈ విధంగా తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటే బెటర్. రిజల్టు తెలిసినా కూడా ప్రమోట్ చేయాల్సిందే.. అదే మంత్ర!!