Begin typing your search above and press return to search.

డ‌బుల్ యాక్ష‌న్లో ధ‌నుష్ వీరంగం

By:  Tupaki Desk   |   29 Sep 2016 4:49 AM GMT
డ‌బుల్ యాక్ష‌న్లో ధ‌నుష్ వీరంగం
X
వేల ఇల్ల ప‌ట్ట‌దారి (తెలుగులో ర‌ఘువ‌ర‌న్ బీటెక్‌) సినిమాతో రెండేళ్ల కింద‌ట కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్‌. ఐతే ఆ ఊపులో గ‌త ఏడాది చ‌క‌చ‌కా రెండు సినిమాలు వ‌దిలాడు. ఒక‌టి మారి.. ఇంకోటి తంగ‌మ‌గ‌న్ (న‌వ మ‌న్మ‌థుడు). రెండూ ఫ్లాప‌య్యాయి. తాజాగా తొడారి (రైల్‌) కూడా చేదు అనుభ‌వాన్నే మిగిల్చింది. ఇప్పుడ‌త‌ను హిట్టు కొట్టి తీరాల్సిన స్థితిలో ఉన్నాడు. ధ‌నుష్ ఆశ‌ల‌న్నీ ప్ర‌స్తుతం ‘కోడి’ మీదే ఉన్నాయి. ఇంత‌కుముందు త‌న నిర్మాణంలోనే ఎదిర్ నీచిల్.. కాకి స‌ట్టై లాంటి హిట్టు సినిమాలు తీసిన దురై సెంథిల్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ధ‌నుష్ న‌టించిన సినిమా ఇది.

ధ‌నుష్ గ‌త మూడు సినిమాలు ఫ్లాపులే అయినా ‘కోడి’ మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. దీపావ‌ళికి విడుద‌ల‌య్యే ఈ సినిమా క‌చ్చితంగా సూప‌ర్ హిట్ట‌వుతుంద‌న్న ఆశ‌తో ఉన్నారు అభిమానులు. ఆ అంచ‌నాలకు త‌గ్గ‌ట్లే ఉంది ‘కోడి’ ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్. ధ‌నుష్ ను రెండు ర‌కాల లుక్స్ లో చూపిస్తూ ఈ పోస్ట‌ర్ డిజైన్ చేశారు. ఒక జీపు.. అందులో లోప‌ల సాఫ్ట్ లుక్ లో ఉన్న ధ‌నుష్ క‌నిపిస్తాడు.. కెమెరా అలాగే వెన‌క్కి వ‌స్తుంది.. జీపు మీద గ‌డ్డంతో ర‌ఫ్ లుక్ లో ఉన్న ధ‌నుష్ కనిపిస్తాడు.

మొత్తానికి ‘కోడి’ మోష‌న్ పోస్ట‌ర్ సింప్లీ సూప‌ర్బ్ అనిపిస్తోంది. ధ‌నుష్ ఇందులో క‌వ‌ల‌లుగా ద్విపాత్రాభిన‌యం చేస్తుండ‌టం విశేషం. ఊర మాస్ లా క‌నిపిస్తున్న రెండో పాత్ర‌లో ధనుష్ వీరంగం చూడొచ్చేమో. ఇందులో త్రిష ఓ క‌థానాయిక‌గా నటిస్తుండ‌టం విశేషం. మ‌రో హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. ఈ చిత్రం దీపావ‌ళికి ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/