Begin typing your search above and press return to search.

బ్రహ్మీలా దెబ్బలు తినేస్తాడేమో

By:  Tupaki Desk   |   29 Aug 2015 11:21 PM GMT
బ్రహ్మీలా దెబ్బలు తినేస్తాడేమో
X

కమెడియన్‌ నుంచి టర్న్‌ అయ్యి హీరో అయ్యాడు ధన్‌ రాజ్‌. ఇప్పటికే లీడ్‌ హీరోగా కొన్ని సినిమాల్లో నటించాడు. అయితే అవేవీ సోలో హీరోగా కావు. ఇప్పుడు అతడు సోలో హీరోగా నటించిన 'పనిలేని పులిరాజు' త్వరలో రిలీజ్‌ కి రెడీ అవుతోంది. ఇప్పటికే పబ్లిసిటీ అదరగొట్టేస్తున్నారు. పోస్టర్‌ లో ధన్‌రాజ్‌ అదిరిపోయే స్టయిల్‌లో కనిపిస్తున్నాడు. పూల చొక్కాయ్‌, మెడలో స్కార్ప్‌ బిగించి నిజంగానే పనిలేని పులిరాజాలా ఉన్నాడు. ఇలాంటి క్యాండిడేట్‌ లు ప్రతి పల్లెటూళ్లో వీధికొకడైనా తగల కుండా ఉండడు. అయితే పులిరాజా వసూళ్లు సాధించి నెగ్గుకొస్తాడా? లేక చతికిలబడతాడా? అన్న డిష్కసన్‌ సాగుతోందిప్పుడు.

కమెడియన్లుగా రాణించి హీరోలైపోయిన చాలామంది పరిస్థితి ఆగమ్యగోచరం. అప్పట్లో బ్రహ్మానందం ఉన్నట్టుండి హీరో అయిపోయి పెద్ద ఫ్లాప్‌ అందుకున్నాడు. వెన్నెలకిషోర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఢమాల్‌ మంది. ఆ తర్వాత బ్రహ్మీకి మామూలు కమెడియన్‌ రోల్స్‌ కూడా తగ్గిపోయాయి. అలాగే హీరో సునీల్‌ ఇప్పటికే మూడు నాలుగు విజయాలు సాధించీ అవకాశాల్లేక రేసులో వెనక్కి తగ్గిపోయాడు. ఇప్పుడు ధన్‌రాజ్‌ పరిస్థితి అలా కాదు కదా! హీరో అయ్యాడులే అని అవకాశాలు ఇవ్వడం మానేయరు కదా! సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా అతడికి అవకాశాలిచ్చేవాళ్లు ఉంటే ఫర్వాలేదు. పనిలేని పులిరాజు చిత్రాన్ని పాలేపు మీడియా పతాకంపై రవి.కె.పున్నం, పి.వి.నాగేష్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్నారు.