Begin typing your search above and press return to search.

చిత్తూరు యాసలో నాని హల్చల్

By:  Tupaki Desk   |   17 Jan 2018 7:59 AM GMT
చిత్తూరు యాసలో నాని హల్చల్
X
ఏడాదికి కనీసం మూడు సినిమాలు చేసేలా పక్కా ప్లానింగ్ తో దూసుకుపోతున్న నాని ఈ సంవత్సరం మాత్రం ఓ మూడు నెలలు ఆలస్యంగా తన ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నాడు. తన కొత్త సినిమా కృష్ణార్జున యుద్ధం ఏప్రిల్ కు సిద్ధమవుతోంది. కెరీర్ లో మూడో సారి డ్యూయల్ రోల్ చేస్తున్న నాని లుక్స్ కృష్ణ - అర్జున్ గా ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందరిని బాగా ఆకట్టుకున్నది మాత్రం కృష్ణగా నాని ఊర మాస్ రఫ్ లుక్ లో కనిపించడం. నిన్న దీనికి సంబంధించిన ఫస్ట్ సాంగ్ కూడా విడుదల చేసారు. ‘దారి చూడు దుమ్ము చూడు’ అంటూ మొదలయ్యే ఈ పాట మొత్తం చిత్తూర్ స్లాంగ్ తో వెరైటీగా లిరిక్స్ రాయించారు. హిప్ హాప్ తమిజా ఇచ్చిన ట్యూన్ క్యాచీగా ఉన్నప్పటికీ బాగా తమిళ వాసన కొడుతోంది.

దీని ప్రకారం చూస్తే నాని వేస్తున్న రోల్ చిత్తూర్ బోర్డర్ లో ఉండే మాస్ హీరో తరహాలో ఉంటుందని అర్థమైపోతోంది. ‘కమలపూల కట్టే మీద కన్నెపిల్లల జోరే చూడు’. ‘బులుగు పూల చొక్కా’ అంటూ గతంలో వినని కొత్త పదాలతో ఆకట్టుకునేలా దీన్ని కంపోజ్ చేసారు. ఈ మధ్య వరసగా లవ్ అండ్ యూత్ స్టోరీస్ తో కాస్త మొనాటనీ అనిపిస్తున్నాడు అని కామెంట్స్ వినిపిస్తున్న నేపధ్యంలో నానికి ఇది పూర్తిగా మేకోవర్ అని చెప్పొచ్చు. కృష్ణ ఓకే మరి అర్జున్ ఎలా ఉంటాడో అనే ఆసక్తి అందరిలో మొదలైంది. పాప్ సింగర్ గా రెండో పాత్ర ఉంటుందని పోస్టర్ ని బట్టి అనిపిస్తోంది. దీనికి కూడా ఏమైనా స్పెషల్ సర్ప్రైజ్ సినిమాలో ప్లాన్ చేసారేమో చూడాలి. ఏప్రిల్ 12 న విడుదల ఫిక్స్ చేసుకున్న కృష్ణార్జున యుద్ధం మరోసారి దీన్ని అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంది. 2.0 ఏప్రిల్ 13 నుంచి మళ్ళి వాయిదా పడుతుంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో అదే కనక నిజమైతే నానికు ఏ చిక్కులు లేనట్టే.