Begin typing your search above and press return to search.

సంగీత సాగరంలో ఉరకలేసే కెరటం - దేవి

By:  Tupaki Desk   |   2 Aug 2015 6:15 AM GMT
సంగీత సాగరంలో ఉరకలేసే కెరటం - దేవి
X
దేవి శ్రీ ప్రసాద్ టాలీవుడ్ లోకి వచ్చే వరకూ చాలామందికి తెలియదు... ఆడియో రిలీజ్ లకు కూడా సంగీత దర్శకుల ద్వారా క్రేజ్ తీసుకురాగాలడని... దేవి మైకు పట్టేవరకూ తెలియదు ఒక సంగీత ప్రియుడు స్వరాలతో సంబంధంలేకుండా పాడిన పాట రసరమ్యంగా మారుతుందని, దేవి రాసిన పాటలు వింటేగానీ తెలియదు.. నరనరానా స్వరాలను జీర్ణించుకునే వారికి సాహిత్యం సైతం స్నేహం చేస్తుందని.. అతను స్టేజ్ మీద ఆడతాడు... పాడతాడు... పాటలకు సుస్వరాలను ఆ స్వరాలకు అప్పుడప్పుడు చక్కన్ని వర్ణాలను అందించగల ఘనుడు దేవి శ్రీ ప్రసాద్.

తూర్పుగోదావరి జిల్లాలో పుట్టిన ఈ చిచ్చర పిడుగుది సినిమా ఇండస్ట్రీతో సంబంధంవున్న కుటుంబమే. ఆయన తండ్రి సత్యమూర్తిగారు స్క్రిప్ట్ రచయిత. 17ఏళ్ళ వయసులో ఎం.ఎస్ రాజు, కోడి రామకృష్ణ 'దేవి' సినిమాకు స్వరాలను సమకూర్చి తన టాలెంట్ తో అందరినీ విస్మయపరచడమే కాక ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ఆ తరువాత శ్రీను వైట్ల 'నీకోసం', 'ఆనందం' సినిమాలకు మంచి సంగీతాన్ని అందిస్తూ ఇండస్ట్రీలో నెమ్మది నెమ్మదిగా నిలదొక్కుకున్నాడు

ఆపై తన ప్రతీ సినిమాలో ఒక పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది. 'కలుసుకోవాలని' లో "ఉదయించిన సూర్యుడినడిగా", 'ఖడ్గం' సినిమాలో 'నువ్వు నువ్వు', వెంకీలో 'గోంగూర తోటకాడ', వర్షంలో 'మెల్లగా కరగనీ'వంటి పాటలే ఉదాహరణ. కెరీర్ లో ఉత్తమ సంగీత దర్శకుడిగా నాలుగు నందులు సొంతం చేసుకున్నాడు దేవి.

కెరీర్ లో అగ్రహీరోలందరి తోనూ నటించిన దేవికి శ్రీను వైట్ల, సుకుమార్ లతో ప్రత్యేక స్నేహం వుంది. శ్రీను చాలా సినిమాలకు, సుక్కూ వి అన్ని సినిమాలకూ దేవినే మ్యుజీషియాన్.రింగా రింగా రొజెస్ అని పాడుకునే చిన్న పిల్లలు కూడా రింగ రింగా అని పాడుతున్నారంటే అదంతా దేవి గొప్పతనమే. దేవీకి మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టం. 'శంకర్ దాదా MBBS' తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని దేవి పలుమార్లు తెలిపాడు. ప్రస్తుతం తెలుగులో శ్రీమంతుడు, తమిళంలో పులి ఆడియో సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు మన దేవి. మరి ఈ యంగ్ తరంగ్ చేతినిండా సినిమాలతో ఇలానే బోలెడు బర్త్ డే లు చేసుకోవాలని ఆశిస్తూ తుపాకీ. కామ్ ద్వారా దేవి శ్రీ ప్రసాద్ కి జన్మదిన శుభాకాంక్షలు.