ముచ్చటగా మరోసారి మహేష్ తో

Fri Oct 13 2017 11:40:16 GMT+0530 (IST)

యువ సంచలన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నాడంటే చాలు దాదాపు ఆ సినిమాకు పాటలతోనే భారీ క్రేజ్ వస్తుందని చెప్పవచ్చు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా దేవి మాత్రం కొత్త తరహాలో సాంగ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ గా ఉన్న సంగీత దర్శకుల్లో ఈ రాక్ స్టార్ ఒక్కడే అని చెప్పాలి.పోటీగా ఎంత మంది వచ్చినా కూడా దేవి శ్రీ ప్రసాద్ తనదైన శైలిలో సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ వెళుతున్నాడు. అయితే ఇప్పటికే ఈ ఏడాది డబుల్ హ్యాట్రిక్ కొట్టి మంచి ఊపు మీద ఉన్న దేవి మరో బిగ్ సినిమాకు సైన్ చేశాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న  మహేష్ బాబు 25వ చిత్రంకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు. ఇప్పటికే మహేష్ తో '1 నేనొక్కడినే' - 'శ్రీమంతుడు' సినిమాలను చేసి మంచి బాణీలను అందించాడు.

అలాగే మహేష్ - కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం చేస్తున్న భరత్ అనే నేను సినిమాకు కూడా దేవినే మ్యూజిక్ డైరెక్టర్. ఇక నాలుగవసారి మహేష్ 25వ సినిమాకు సంగీతాన్ని అందించనున్నాడు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను దిల్ రాజు - సి.అశ్వినిదత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.