Begin typing your search above and press return to search.

శవంతో సెక్సా?? ఇలాంటివి కూడానా..

By:  Tupaki Desk   |   23 March 2017 7:06 AM GMT
శవంతో సెక్సా?? ఇలాంటివి కూడానా..
X
కాదేది కవితకు అనర్హం అని ఆనాడు మహాకవి శ్రీశ్రీ చెబితే.. కాదేది సినిమా స్టోరీకి అనర్హం అంటూ ఈనాడు చాలామంది చెబుతున్నారు. శవాలతో సెక్స్ చేయడం అనే అంశాన్ని కూడా మనం సినిమాగా తీయొచ్చు. ఆల్రెడీ ఇంగ్లీష్‌ అండ్ ఫ్రెంచ్ లో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. నెక్రోఫీలియా అనే ఈ కాన్సెప్టుతో ఇప్పుడు తెలుగులో కూడా ఒక సినిమా వస్తోంది తెలుసా.

'దేవిశ్రీప్రసాద్' అనే పేరుతో వస్తున్న ఈ సినిమా.. దేవి.. శ్రీ.. ప్రసాద్ అనే ముగ్గురు కుర్రాళ్ళ కథ. ధనరాజ్.. మనోజ్ నందం.. మరో కుర్రాడు టైటిల్ పాత్రలను చేస్తున్నారు. అయితే టీజర్ చూసిన ఎవ్వరికైనా కూడా గాట్టి షాకే తగులుతుంది. స్వామి రారా సినిమాతో ఫేమస్ అయిన పూజ రామచంద్రన్ ను చంపేస్తారు. ఆమె డెడీ బాడీని మార్చరీలో పెడతారు. అప్పుడు ఆమె శవంతో ఎవరో సెక్స్ చేసుకుంటూ ఉంటే.. ఆమె ముఖం క్లోజప్ ను చూపిస్తూ.. కాస్త భయపెట్టే కార్యక్రమం మొదలెట్టాడు దర్శకుడు. స్పెర్మ్ డొనేషన్ వంటి కాన్సెప్టులతో సినిమాలో తీస్తే లేదు కాని.. శవంతో సెక్స్ చేస్తే ఏముందిలే అనుకున్నారా ఏంటి?

ఏదేమైనా కూడా సంచలనానికి కేంద్ర బింధువుగా మారిన ఈ టీజర్ చూశాక.. అసలు సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇస్తుందా అనే సందేహం వస్తోంది. లెటజ్ సీ.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/