Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ డీఎస్పీ ఇచ్చిన అదిరే ఐటెం

By:  Tupaki Desk   |   23 July 2016 5:39 AM GMT
ఎన్టీఆర్ డీఎస్పీ ఇచ్చిన అదిరే ఐటెం
X
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇచ్చే సినిమాలంటే.. మిగతాదంతా ఓ ఎత్తు అయితే.. ఐటెం సాంగ్ ఒకటీ మరొక ఎత్తు అనే రేంజ్ లో ఉంటుంది. చాలా సినిమాల్లో ఐటెం సాంగులు ఇరగదీసేస్తాడు డీఎస్పీ. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం కూడా ఓ అదిరిపోయే బీట్ తో ఐటెం సాంగ్ ని ఇచ్చాడని తెలుస్తోంది.

కొత్త టైప్ సౌండ్ ట్రాక్ తో డీఎస్పీ ఇచ్చిన బీట్ విన్న యంగ్ టైర్ ఎన్టీఆర్.. దర్శకుడు కొరటాల శివ విపరీతంగా ఎగ్జైట్ అయ్యారట. తమ సినిమాలో ఈ మ్యూజిక్ ని కచ్చితంగా ఇంట్రడ్యూస్ చేయాల్సిందే అనే రేంజ్ లో డీఎస్పీ మరిపించేశాడని అంటున్నారు. అందుకే ముందుగా అనుకోకపోయినా.. తమ మూవీలో ఈ ట్రాక్ సెట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ఐటెం సాంగ్ కోసం ఇప్పటికే తమన్నాని అప్రోచ్ అయ్యారని.. ఎన్టీఆర్ తో ఆడిపాడేందుకు మిల్కీ కూడా సై అనిందనే టాక్ ఉంది.

ఆగస్ట్ రెండో వారంలో ఎన్టీఆర్- తమన్నాలపై ఈ ఐటెం సాంగ్ చిత్రీకరణ జరిపేందుకు నిర్ణయించారు. సెప్టెంబర్ 2న విడుదల కానున్న ఈ చిత్రానికి.. ఆగస్ట్ లో ఆడియో లాంఛ్ చేసేలా ప్లానింగ్ చేశారు. మొత్తానికి దేవిశ్రీ ప్రసాద్ నుంచి మరో అదిరే ఐటెం సాంగ్ రావడం.. అందులో ఎన్టీఆర్ చిందేయనుండడం అయితే ఖాయమే.