Begin typing your search above and press return to search.

గీతాంజలి, ప్రేమదేశం.. కుమారి 21 ఎఫ్

By:  Tupaki Desk   |   3 Oct 2015 7:30 PM GMT
గీతాంజలి, ప్రేమదేశం.. కుమారి 21 ఎఫ్
X
సుకుమార్ ముద్ర పడటం ఆలస్యం.. కుమిరి 21 ఎఫ్ సినిమాకు ఆటోమేటిగ్గా క్రేజ్ వచ్చేసింది. ఇక ఎన్టీఆర్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ టీజర్ లాంచ్ జరగడంతో మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ మాటలు చూస్తుంటే అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. తెలుగులో ఇలాంటి సినిమా ఈ మధ్య రాలేదని.. ఇదో ట్రెండ్ సెట్టర్ అవుతుందని అంటున్నాడు ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చిన దేవి.

మౌనరాగం - గీతాంజలి - ప్రేమదేశం లాంటి సినిమాలు ఆయా కాలాల్లో యూత్ ఆడియన్స్ కి ఎలా నచ్చాయో.. ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో అలాంటి సినిమానే ‘కుమారి 21 ఎఫ్’ అని చెప్పాడు దేవి. సుకుమార్ ఏం రాస్తాడా, ఏం తీస్తాడా అని.. మామూలు ప్రేక్షకుల్లాగే తాను కూడా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తానని.. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ‘కుమారి 21 ఎఫ్’ స్క్రిప్టును సుకుమార్ తీర్చిదిద్దాడని దేవి చెప్పాడు.

రీరికార్డింగ్ కోసం సినిమా అంతా చూశానని.. కాబట్టి ఈ సినిమా గురించి మాట్లాడే హక్కు తనకుందని.. సినిమా అద్భుతంగా వచ్చిందని దేవి అన్నాడు. సినిమా ప్రమోషన్ కోసం కాకుండా నిజాయితీగా చెబుతున్నానని.. ‘కుమారి 21 ఎఫ్’ ఓ ట్రెండ్ సెట్టర్ అవుతుందని దేవి అన్నాడు. త్వరలోనే ఈ సినిమా కోసం తాను చేసిన ఓ స్పెషల్ యూత్ ఫుల్ సాంగ్ ను ‘సింగిల్’గా రిలీజ్ చేయబోతున్నట్లు దేవి చెప్పాడు.