ముత్తాత పాత్రకు రెడీ అయిపోయాడు!!

Tue Apr 24 2018 13:31:06 GMT+0530 (IST)

తండ్రి రియల్ లైఫ్ ను సినిమాగా తీసే అవకాశం అందరికీ రాదు. అందులో తనే తండ్రి పాత్రలో నటించడం ఓ అరుదైన విషయమే. దీన్నే సుసాధ్యం చేయబోతున్నారు నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ బయోపిక్ లో తానే స్వయంగా తండ్రి పాత్రను పోషించబోతున్నారు.అయితే.. ఎన్టీఆర్ మూవీని ఆయన పుట్టినప్పటి నుంచి స్టార్ట్ చేయాలన్నది దర్శకుడు తేజ యోచన.. ఇప్పటికే ప్రిపేర్ చేసిన స్క్రిప్ట్ కూడా ఇలాగే ఉంటుందట. అందుకే పొత్తిళ్లలో ఉండే ఎన్టీఆర్ పాత్రను ఎవరితో చేయించాలనే సంశయం ఇన్నాళ్లు వెంటాడిందట. ఇప్పుడు ఆ విషయంలో కూడా ఓ క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తోంది. స్వయంగా తన మనవడితోనే ఈ రోల్ చేయించనున్నారట బాలయ్య. నారా లోకేష్- బ్రాహ్మిణల సంతానం అయిన నారా దేవాన్షన్ తో.. ఎన్టీఆర్ పసి పిల్లాడిగా ఉన్నప్పటి సీన్స్ ను పిక్చరైజ్ చేయనున్నారని తెలుస్తోంది. అంటే ముత్తాత ఎన్టీఆర్ పాత్రలో నటించబోతున్నాడు దేవాన్ష్.

ఇంకా ఊహ కూడా తెలియకుండానే తమ వంశానికి కీర్తి ప్రతిష్టలు గడించిపెట్టిన పాత్రలో.. ఆ కుటుంబానికే చెందిన వంశోద్ధారకుడు నటించడం నిజంగా చెప్పుకోవాల్సిన విషయమే. ఇక ఎన్టీఆర్ మూవీలో.. ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మినహా.. దాదాపు అందరు నందమూరి వారసులు కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్.. తారకరత్న.. నారా రోహిత్ వంటి హీరోలు చిన్న చిన్న పాత్రలలో కనిపిస్తారట. కళ్యాణ్ రామ్ కుమారుడు శౌర్య రామ్ కూడా ఎన్టీఆర్ పాత్రలోనే.. స్కూల్ లు వెళ్లే వయసుకు సంబంధించిన ఎపిసోడ్ లో కనిపిస్తాడని తెలుస్తోంది.