Begin typing your search above and press return to search.

గట్టిగా కొట్టడానికి రెడీ అవుతున్న దేవా కట్టా

By:  Tupaki Desk   |   11 Nov 2018 11:30 AM GMT
గట్టిగా కొట్టడానికి రెడీ అవుతున్న దేవా కట్టా
X
దర్శకుడు దేవా కట్టా పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులందరికీ 'ప్రస్థానం' సినిమా గుర్తొస్తుంది. చాలామంది ఈ సినిమాను మోడరన్ తెలుగు క్లాసిక్ అంటుంటారు. కానీ ఎందుకో దేవా కట్టా ఆ రేంజ్ సినిమా ఇప్పటివరకూ మరొకటి తెరకెక్కించలేకపోయాడు. కానీ తాజా సమాచారం ప్రకారం దేవా కట్టా ఒక భారీ మల్టిస్టారర్ ట్రిలజీ కి సన్నాహలు చేస్తున్నాడట.

ఈ మూడుపార్టుల సినిమా కథకు నిజ జీవిత సంఘటనలు అధారమట. వచ్చే ఏడాదిలో లాంచ్ చేయనున్న ఈ ద్విభాషా చిత్రానికి ప్రస్తుతం స్క్రీన్ ప్లే వర్క్ జరుగుతోందట. ఇక ఈ సినిమాలో హీరోలు ఎవరు.. బడ్జెట్ ఎంత అనే విఅవరాలు ఇంకా బయటకు రాలేదు. ఇదిలా ఉంటే దేవా కట్టా ప్రస్తుతం సంజయ్ దత్ హీరోగా తెరకెక్కుతున్న 'ప్రస్థానం' హిందీ రీమేక్ కు దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమా పూర్తి కాగానే నెట్ ఫ్లిక్స్ వారు నిర్మిస్తున్న 'బాహుబలి' ప్రీక్వెల్ వెబ్ సీరీస్ కు డైరెక్షన్ బాధ్యతలు చేపడతాడు. 'బాహుబలి' కి ప్రీక్వెల్ కావడంతో ఈ వెబ్ సీరీస్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ వెబ్ సీరీస్ తో దేవా కట్టా మరో సారి తన సత్తా చాటుతాడనే అంచనాలు ఉన్నాయి.