Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: దేవదాసుల హంగామా పీక్స్!

By:  Tupaki Desk   |   20 Sep 2018 3:54 PM GMT
ట్రైలర్ టాక్: దేవదాసుల హంగామా పీక్స్!
X
ఇప్పటికే ఇంట్రెస్టింగ్ ప్రోమోస్ తో ప్రేక్షుకుల్లో క్యూరియాసిటీని పెంచిన 'దేవదాస్' టీమ్ ఈ రోజు ట్రైలర్ తో వచ్చారు. "అంతా భ్రాంతియేనా.." పాట బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తూ ఉంటే నాని తన క్లినిక్ లో దిగాలుగా ఉంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ షాట్ లో నానిని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి పోతారు. ఇక అలా ఎందుకు జరిగింది అనేది సస్పెన్స్..!

ఇక నాగ్ "తన పేషెంట్ ని" అంటూ విలన్ గ్యాంగ్ కు పరిచయం చేసుకున్నాడు. ఇక డాన్ నాగ్.. డాక్టర్ నాని లు ఎందుకు కలిసి ఉన్నారనే విషయం సస్పెన్స్ గా ఉంచుతూనే వాళ్ళ మధ్య జరిగిన ఫన్నీ సీన్స్ చూపించారు. నాగ్ 'చీర్స్' అంటూ పెగ్గేస్తుంటే నాని తన బీపీ ని బీపీ మిషన్ తో తనే చెక్ చేసుకోవడం.. ఫ్రస్ట్రేషన్ లో "ఇలా రోజూ వచ్చి మందు కొట్టడం ఏం బాలేదు" అని అరవడం.. సిట్యుయేషనల్ కామెడీనే. పెగ్ ఫాస్ట్ గా లేపేసి "ఒకే నేనిక వెళ్ళొచ్చా" అని అడిగితే "చీర్స్ కొట్టకుండా తాగేశావేంట్రా?" అంటూ నాగ్ ఝలక్ ఇస్తాడు. ఇలా రచ్చగా సాగింది వాళ్ళ రిలేషన్.

నాగార్జున లవ్ డాక్టర్ అవతారం ఎత్తి స్టెతస్కోప్ తో నాని చెక్ చేస్తూ 'నీ ప్రాబ్లెం ఏంటో తెలుసా?" అనగానే ఇక నాని లవ్ సీన్స్ స్టార్ట్. "అయినా నీలాంటివాడికి ప్రేమంటే ఏం తెలుస్తుంది చెప్పు!" అంటూ నాగ్ ని చూసి పకపకా నవ్వుతాడు.. ఇక అక్కినేని వారు తమ రొమాంటిక్ యాంగిల్ ను బయటకు తీస్తారు. అంతా ఫన్నే కాదు.. సీరియస్ మాఫియా యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. నాగ్ అలా లెఫ్ట్ హ్యాండ్ తో గన్ ని స్టైల్ గా తిప్పడం స్టైలిష్ జెస్చర్స్ ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయిస్తాయి. యాక్షన్ సీన్స్ లో యంగ్ & ఎనర్జిటిక్ నాగ్ మళ్ళీ కనిపించాడు. ఇక నాగ్ కొన్ని ఇంట్రెస్టింగ్ స్టెప్స్ కూడా ఇరగదీశాడు.

టోటల్ గా 100% కమర్షియల్ ఎంటర్టైనర్ చూడబోతున్నమనే ఫీల్ ఇచ్చింది ట్రైలర్. సెప్టెంబర్ 27 కి బుకింగ్ చేసుకోవడం మర్చిపోవద్దే... ప్రతివారం ఇలాంటి ఫుల్ ఎంటర్టైన్మెంట్ రాదు కదా!