'దేవదాస్' నైజాం అంత పలికిందా?

Mon Sep 03 2018 09:33:21 GMT+0530 (IST)

కింగ్ నాగార్జున - నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం `దేవదాస్`. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. అశ్వనిదత్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్లు సహా టీజర్ రిలీజైన సంగతి తెలిసిందే. దేవా - దాస్ లుక్ కి అద్భుత స్పందన వచ్చింది. మందేసి చిందేయడంలో దేవా - దాసు మధ్య అండర్ స్టాండింగ్ జనాలకు కిక్కిచ్చింది. అందుకే సెప్టెంబర్ 27న రిలీజవుతున్న ఈ సినిమా కోసం అటు కింగ్ అభిమానులు - ఇటు నాని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంటుగా రిలీజైన టీజర్ కి యూట్యూబ్ లో అద్భుత స్పందన వచ్చింది. నాగార్జున - నాని కాంబో మధ్య ఫన్ - కామెడీ అద్భుతంగా వర్కవుటైంది. ఇదో లైటర్ వెయిన్ కామెడీ ఎంటర్ టైనర్ చిత్రమని అభిమానులకు అర్థమైంది.ప్రస్తుతం ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ గురించిన ఆసక్తికర చర్చ సాగుతోంది. నాని వరుస హిట్లతో దూకుడుమీదున్నాడు. ప్రయోగాలతో సక్సెస్ అందుకున్న నాగార్జునతో కలిసి నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై ట్రేడ్ లోనూ ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం.. దేవదాస్ నైజాం హక్కుల్ని 11.07కోట్లకు ఏషియన్ ఎంటర్ ప్రైజెస్ అధినేత సునీల్ నారంగ్ కొనుక్కున్నారని తెలుస్తోంది. ఇతర ఏరియాల బిజినెస్ అంతే స్పీడ్ గా ఉందన్న సమాచారం అందింది.

ఈ చిత్రంలో కింగ్ సరసన ఆకాంక్ష సింగ్ - నాని సరసన రశ్మిక మందన కథానాయికలుగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. `శమంతకమణి` చిత్రంతో క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టడమే ధ్యేయంగా ఈ సినిమాని ఎంతో కమిట్ మెంట్ తో తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది. మొత్తానికి బిజినెస్ పరంగా  టీజర్ పెర్ఫెక్ట్ టైమింగ్ తో వర్కవుటైందన్న చర్చ ట్రేడ్ లో సాగుతోంది.