Begin typing your search above and press return to search.

పాక్ లో షారుక్ అభిమాని జైలుపాలు!

By:  Tupaki Desk   |   27 Aug 2016 4:07 AM GMT
పాక్ లో షారుక్ అభిమాని జైలుపాలు!
X
ఒక తెలుగు సినిమాలో జైలు పాలయిన ఒక కమెడియన్ ని తోటి నటుడు అడుగుతాడు.. నువ్వు ఏనేరం చేసి జైలుకు వచ్చావు అని. దానికి ఆ కమెడియన్... ఒక తల్లి మాటను నిజం చేసినందుకు అని సమాధానం చెప్తాడు. వివరంగా చెప్పమంటే... "అన్నం సరిగా తినకపోతే బూచోడు వస్తాడని, వచ్చి ఎత్తుకుపోతాడని ఒక తల్లి తన బిడ్డకు చెప్పింది, అయినా ఆ కుర్రాడు వినకుండా అలానే చేస్తున్నాడు. ఆ టైంలో నేను వచ్చి ఆ కుర్రాడిని ఎత్తుకువచ్చేసి ఆ తల్లిమాటను నిజం చేశాను. విచిత్రం ఏమిటంటే.. ఆ తల్లే నాపై కేసుపెట్టింది" అని అమాయకంగా చెప్పుకొస్తాడు. అలానే ఉంది పాకిస్తాన్ లోని షారుక్ ఖాన్ ఫ్యాన్ పరిస్థితి.

పాకిస్థాన్ కు చెందిన జహంగీర్ అనే వ్యక్తికి బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ అంటే వీరాభిమానం. ఈ వీరాభిమాని కూడా జైలు పాలయ్యాడు. ఎందుకంటే... చెప్పులు తయారుచేసినందుకు. అవును చెప్పులు తయారు చేయడమే అతడు చేసిన తప్పు. ఇంతకూ జరిగిందేమిటంటే.. పెషావర్ లో ఉంటున్న షారుక్ బంధువు ఒకరు.. షారుక్ కోసం పెషావరీ చెప్పులు కావాలని అడిగారట. దీంతో జహంగీర్ కు ఎక్కడలేని ఆనందం వచ్చేసి చెప్పులు తయారుచేశాడట. అదేంటి ఒక భారతీయుడికి చెప్పులు తయారుచేస్తేనే జైల్లో వేస్తారా అని అమాయకంగా ప్రశ్నించకండి! ఎందుకంటే షారుక్ కి చెప్పులు కుట్టినందుకు కాదు ఇతడిని జైలుకు పంపింది. తన అభిమాన హీరోకి చెప్పులు కుట్టింది జింక చర్మంతో. జింక చర్మంతో చెప్పులుకుట్టి ఇవ్వాలనేంత అభిమానం ఇతడికి ఉండొచ్చు గాక... కాని అటవీశాఖ అధికారులనేవాళ్లు ఒకరుంటారు కదా! అంతే... ఈ విషయం ఆ అధికారులకు తెలియడం - జహంగీర్ ను పట్టుకుపోవడం చకచకా జరిగిపోయాయి. చెప్పులు చేయమని అడిగారు కానీ.. జింక చర్మంతో అని చెప్పారా?