టివి9 దీప్తి బాగా ఇంప్రెస్ చేస్తోందే..

Wed Jun 20 2018 15:58:39 GMT+0530 (IST)

బిగ్ బాస్ సెకండ్ సీజన్ పై భిన్నాభిప్రాయాలు బాగానే వస్తున్నాయి. టాక్ ఎలా ఉన్నా కూడా మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది. షోలలో ఒకరిపై ఒకరు తెలియకుండా కుట్రలు పన్నడం. స్నేహంగా మాట్లాడుకోవడం చూస్తుంటే షోకి మరికొన్ని రోజుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ రావచ్చు అని తెలుస్తోంది. ఇకపోతే నిన్న హౌజ్ లో మొదటి సారి ఒక వినూత్నమైన స్కిట్ జరిగింది. రాజులు రాణులు అంటూ నూతన్ నాయుడు - దీప్తి నల్లమోతు అలరించారు.ముఖ్యంగా దీప్తి అయితే చాలా కొత్తగా మహారాణి పాత్రలో కనిపించింది. పెద్ద పెద్ద డైలాగులతో ఆహార్యాన్ని చూపుతూ అబ్బురపరచింది. ఈ యాంకర్ కమ్ జర్నలిస్ట్ ధరించిన కాస్ట్యూమ్ కూడా ఆకట్టుకుంది. టివి9 యాంకర్ గా రెగ్యులర్ న్యూస్ లను చదివిన అనుభవం ఆమెకు ఈ షోలో ఉపయోగపడింది. ఏ మాత్రం గ్యాప్ లేకుండా పాత కాలం డైలాగులతో అందరిని ఆకట్టుకుంది. అలాగే నూతన్ నాయుడు మహారాజు లాగా బాగానే సెట్ అయ్యాడు.

ఇక కొత్తగా వచ్చిన నందిని రాయ్ ప్రిన్సెస్ అంటు పరవాలేదు అనిపించే విధంగా యాక్టింగ్ చేసింది. ఎవరు ఎలా చేసినా కూడా దీప్తి మాత్రం అదిరిపోయేలా చేసిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా ఆమె బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తరువాత తప్పకుండా సినిమాల్లో అవకాశాలు అందుకుంటుందని ఒక టాక్ వైరల్ అవుతోంది. ఇక 10 రోజుల్లోనే కాంట్రవర్షియల్ న్యూస్ లను క్రియేట్ చేస్తున్న బిగ్ బాస్ మిగిలిన రోజుల్లో ఇంకెన్ని వైరల్ న్యూస్ లలో నిలుస్తారో చూడాలి.