బెడ్ పై కూడా రణవీర్.. అంటున్న దీపిక!

Fri Feb 22 2019 07:00:01 GMT+0530 (IST)

దాదాపు ఐదేళ్ళ ప్రేమ తర్వాత రణవీర్ సింగ్.. దీపిక పదుకొనే గత ఏడాది నవంబర్ లో వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.  పెళ్ళికి ముందు లవ్ బర్డ్స్ లాగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ దీప్-వీర్ జంట ఇప్పుడు కూడా క్రేజీ కపుల్ గానే చలామణీ అవుతున్నారు. ఇద్దరూ తమ కెరీర్ లో ఘన విజయాలు సాధిస్తుండడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు.



తాజాగా ఈ జంట నైకా.కామ్ ఫెమినా బ్యూటీ అవార్డ్స్ 2019 ఈవెంట్ కు హాజరయింది.  ఈ కార్యక్రమంలో వీరికి 'బ్యూటిఫుల్ కపుల్ ఆఫ్ ది ఇయర్' అవార్డు అందజేశారు.  దీపిక ఈ ఈవెంట్ లో బ్లాక్ డ్రెస్ లో దర్శనమిస్తే.. రణవీర్ తనదైన రచ్చ రంబోలా స్టైల్ లో పింకు -బ్లూ- పర్పుల్ ప్రింట్స్ ఉన్న సూట్ లో అందరి దృష్టిని ఆకర్షించాడు.  ఆ డ్రెస్ కలర్లే అయస్కాంతాల్లా ఉన్నాయి. వాటి ఆకర్షణ శక్తి అలాంటిది మరి.

అయినా మన టాపిక్ అయన డ్రస్సు.. ఆయన వేసుకునే బ్రైట్ కలర్లు కాదు.  ఆయనగారి.. దీపిక ఆయనగారి సీక్రెట్లు.  అక్కడ ఉన్న యాంకర్ దీపికను "రణవీర్ సింగ్ గురించి అందరికీ తెలియని సీక్రెట్ ఏదైనా చెప్పండి" అని అడిగితే "గంటల తరబడి స్నానం చేస్తాడు. రెడీ కావడానికి ఎక్కువ టైమ్ తీసుకుంటాడు. ఆఖరికి బెడ్ పై కూడా" అని ఆ వాక్యం పూర్తి చేసేలోపు అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. దీంతో ఏం జరిగిందో అర్థం అయి "నా ఉద్దేశం పడుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటాడు" అని క్లారిటీ ఇచ్చింది.

ఆ యాంకర్ రణవీర్ ను "వివాహం తర్వాత మీలో ఏం మార్పు వచ్చింది?"అని అడిగితే "ఫ్యామిలీ మ్యాన్ గా మారాను. ఎక్కువ సమయం ఇంట్లోనే ఉంటున్నాను" అని తెలిపాడు.  పెళ్ళయిన తర్వాత ఇంట్లో ఉండక ఏం చేస్తాడు? తప్పదు.  ఉండకపోతే దీపిక మెల్లగా.. మూడో కంటికి తెలియకుండా రణవీర్ రక్తం తాగుతుంది కదా!