దీపిక అపార్ట్ మెంట్లో అగ్నిప్రమాదం-దీపిక సేఫ్!

Wed Jun 13 2018 17:09:47 GMT+0530 (IST)

ముంబైలో దీపిక నివసించే ప్లాట్ అగ్నిప్రమాదం సంభవించడంతో దేశమంతా ఈ వార్త సంచలనం అయ్యింది. ముంబై వర్లీ ప్రాంతంలోని ప్రభాదేవి ఏరియాలో బీమొండే టవర్స్ ఒక హై రైజ్ (20కి మించిన బహుళ అంతస్తులు) అపార్ట్‌మెంట్లో మంటలు చెలరేగాయి. ఇదులో బి-వింగ్‌లోని 33వ అంతస్థులో దీపిక నివసిస్తోంది. ఈ వార్త తెలిసిన వెంటనే బాలీవుడ్ ప్రముఖులు అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.ప్రమాదానికి కారణాలు ఇంకా వెల్లడికాలేదు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శకటాలు హుటాహుటిన చేరుకుని మంటలు ఆర్పుతూ మరో వైపు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. నగర పాలక సంస్థకు చెందిన అన్ని రకాల సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలు అదుపులోకి తెస్తున్నట్టు ముంబై పోలీసులు ట్వీట్‌లో తెలిపారు. ఇప్పటికే సుమారు 100 మందిని సురక్షితంగా బయటకు తెచ్చారు. ప్రాణ నష్టం ఏమీ ఉండకపోవచ్చంటున్నారు. వెంటనే 6 ఫైరింజన్లు 5 జంబో ట్యాంకర్స్ ఒక అంబులెన్స్ సంఘటన స్థలానికి చేరుకుని చర్యలు చేపడుతున్నాయి.

ఈ వార్త ట్విట్టరులో హోరెత్తిపోయింది. పలువురు ప్రముఖులు దీపిక అబిమానులు స్పందించారు. ఆమెకు ఏమైందో అని ఆందోళన చెందారు. ఆమె నుంచి గంట తర్వాత కూడా ఏ వార్త రాకపోయేటప్పటికి అందరిలో ఆందోళన పెరిగింది. ఎట్టకేలకు ఆమె కొద్దినిమిషాల  క్రితం ట్విట్టరు ద్వారా స్పందించారు. తాను సురక్షితంగా ఉన్నట్లు ప్రకటించారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి అందరికీ రక్షిస్తున్న అగ్నిమాపక సిబ్బంది కోసం మనం ప్రార్తించాలని కోరింది.