Begin typing your search above and press return to search.

రణవీర్ బాడీ ఆమెదేనట!!

By:  Tupaki Desk   |   18 Jun 2018 11:23 AM GMT
రణవీర్ బాడీ ఆమెదేనట!!
X
కండల వీరుడు అంటే బాలీవుడ్ సల్మాన్ ఖాన్ కు మాత్రమే సొంతమైన బిరుదు. కొన్నేళ్ల క్రితం వరకూ అంటే ఇది చెల్లుబాటు అయేది కానీ.. కుర్ర స్టార్లు వచ్చాక ఇలా కండలు.. బాడీ చూపించే హీరోల సంఖ్య బాగానే పెరిగిపోయింది. వీరిలో రణవీర్ సింగ్ గురించి ఎంత స్పెషల్ గా అయినా చెప్పుకోవచ్చు.

కొన్నాళ్ల క్రితం జాన్ అబ్రహాం తన బాడీని ఓ స్థాయిని మించి చూపించేవాడు. అతడు స్టార్ రేంజ్ కు చేరలేకపోయాడు కానీ.. రణవీర్ సింగ్ మాత్రం ఈ విషయంలో నాలుగాకులు ఎక్కువే చదివేశాడు. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఇలాగే కండలు.. సిక్స్ ప్యాకులు చూపిస్తూ ఓ సెల్ఫీని పోస్ట్ చేశాడు రణవీర్ సింగ్. ఇలాంటి ఫోటోలను చూపించడం ఈ అల్లావుద్దీన్ కి కొత్తేమీ కాదు.. కాకపోతే ఈ సారి ఈయన ప్రియురాలు దీపికా పదుకొనే రియాక్ట్ అయింది.

రణవీర్ ఇలా బాడీ చూపిస్తూ పిక్ పెట్టాడో లేదో.. 'మైన్' అంటూ ఆ బాడీ తనదే అనే అర్ధం వచ్చేలా రిప్లై ఇచ్చింది. రణవీర్ సింగ్ టైమ్ లైన్ లో దీపిక కాసింత అరుదుగానే కనిపిస్తూ ఉంటుంది. రణవీర్ తన ప్రేమను బాహాటంగానే చూపుతుంటాడు కానీ.. డిప్స్ మాత్రం ఆచి తూచి స్పందిస్తూనే తిన్నగా పాయింట్ కి వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏకంగా హీరోగారి కండలు నావే అంటూ కామెంట్ పెట్టడం మాత్రం.. హైలైట్ అనాల్సిందే.