Begin typing your search above and press return to search.

అతడితో ఎంతమంది పిల్లల్ని కంటదో?

By:  Tupaki Desk   |   21 Jan 2017 9:30 AM GMT
అతడితో ఎంతమంది పిల్లల్ని కంటదో?
X
హాట్ దుస్తులతో హీట్ పుట్టించటం దీపికకు కొత్తేం కాదు. కానీ.. మాటలతో కూడా ఎక్కడో టచ్ అయ్యేలా మాట్లాడే టాలెంట్ ఆమెలో ఎంత ఉందో చూసినోళ్లు ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. ఈ మధ్యన ఇంటర్వ్యూ సందర్భంగా అమ్మడు చెప్పిన మాటల్ని విన్న వారికి మతి పోయేలా చేసింది. ఒకరి మీద అభిమానాన్ని ప్రకటించేందుకు ఇలా కూడా మాట్లాడొచ్చా? అన్న డౌట్ వచ్చేలా చేసింది.

ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్ లో విన్ డీజిల్ తో నటించిన ఈ భామ.. ఆ చిత్ర ప్రమోషన్లో భాగంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా విన్ డీజిల్ లో వర్క్ చేయటం బాగుందని చెబుతూ.. అతగాడిపై తనకున్న ప్రేమాభిమానాల్ని మాటల్లో కుమ్మరించేసింది. విన్ డీజిల్ తో కలిసి ఉన్నట్లు.. అతడితో పిల్లల్ని కన్నానని.. అయితే అదంతా కలలోనే అంటూ చెప్పేసింది. అమ్మడి మాటలతో విన్ డీజిల్ ఫుల్ ప్లాట్ అయిపోవటం ఖాయమని చెప్పాలి.

తాజాగా మరో హాలీవుడ్ స్టార్ మీద అమ్మడికి మనసైంది. లల ల్యాండ్ చిత్ర కథానాయకుడు ర్యాన్ గోస్లింగ్ తో నటించాలని ఉందని.. తప్పకుండా తనకా ఛాన్స్ దక్కుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. వెండితెర మీద అద్భుతంగా ఆవిష్కృతమైన ప్రేమకథల్లో లల ల్యాండ్ ఒకటని.. అందులో ర్యాన్ నటన అదిరిపోతుందని చెప్పింది. ఒకవేళ.. అమ్మడికి అతడితో నటించే అవకాశం వస్తే.. కలలో మరెంతమంది పిల్లల్ని కంటుందో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/