Begin typing your search above and press return to search.

అక్కడ కూడా టాప్ లో డిప్స్

By:  Tupaki Desk   |   19 March 2018 5:30 PM GMT
అక్కడ కూడా టాప్ లో డిప్స్
X
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే.. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కి ప్రస్తుతం టాప్ బ్యూటీ అనే విషయంలో ఎవరికైనా ఏవైనా డౌట్స్ ఉంటే.. అవన్నీ పద్మావత్ సక్సెస్ తో కొట్టుకుపోయాయి. యాక్టింగ్ లో తన ట్యాలెంట్ తో పాటు.. ఆడియన్స్ లో క్రేజ్ విషయంలో తన డామినేషన్ ఏ స్థాయిలో ఉంటుందో చూపించింది దీపిక.

అయితే.. ఓ ప్లాట్ ఫాంపై టాప్ లో ఉన్నంత మాత్రాన.. అన్నిచోట్లా ఇది రిపీట్ అవ్వాలని రాజ్యాంగం లాంటి వాటిలో మెన్షన్ చేయలేదు. కానీ ఇక్కడ దీపిక ఫాలోయింగ్ స్పెషల్ కాన్ స్టిట్యూషన్ ఉంది. ఏ విషయంలో అయినా తనే టాప్ అనే సంగతి మళ్లీ ప్రూవ్ చేసేసుకుంది. అత్యధిక ఇన్ స్టాగ్రామ్ ఫాలోయర్స్ తో 'మోస్ట్ ఫాలోడ్ అకౌంట్' రికార్డును ఖాతాలో వేసుకున్న దీపికా పదుకొనే.. ప్రస్తుతం 2.24 కోట్ల మందికి పైగా ఫాలో అవుతున్నారు. అందాల భామల్లో ఇదే అతి పెద్ద రికార్డ్. అందుకే ఈమెకు ఈ అవార్డ్ దక్కింది. ఫ్యాన్స్ తోను.. తనను ప్రేమించే వారితోను కనెక్ట్ అయి ఉండడమే తనకు ఈ అవార్డ్ తెచ్చిపెట్టిందని డిప్స్ చెబుతోంది. ఇదే స్థాయిని కొనసాగిస్తానని కూడా అంటోంది దీపిక.

దీపిక తర్వాత 22 మిలియన్ల మంది ఫాలోయర్స్ తో ప్రియాంక చోప్రా సెకండ్ ప్లేస్ లో ఉండగా.. కుర్ర బ్యూటీ ఆలియా భట్ ను 20.8 మిలియన్ల ఇన్ స్టా జనాలు ఫాలో అయిపోతున్నారు. శ్రద్ధా కపూర్ ను కూడా 20 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. 19.8 మంది మిలియన్స్ ఫాలోయర్లతో మోస్ట్ ఎంగేజ్డ్ అకౌంట్ రికార్డు విరాట్ కోహ్లీకి దక్కింది.