Begin typing your search above and press return to search.

రెడ్ కార్పెట్ ను లైట్ అనేసిందే..

By:  Tupaki Desk   |   26 March 2017 4:44 AM GMT
రెడ్ కార్పెట్ ను లైట్ అనేసిందే..
X
నలుగురి కంట్లో పడే గ్రాండ్ అకేషన్లో పాల్గొనే అవకాశం లభిస్తే.. ఎగిరి గంతేసే సెలబ్రిటీల్ని చూస్తుంటాం.అంతర్జాతీయ మీడియాలో దృష్టిలో పడే అవకాశాన్నిఏ మాత్రం మిస్ చేసుకోవటానికి ఇష్టపడరు బాలీవుడ్ భామలు. ఎంత బిజీగా ఉన్నా.. ఆ సమయానికి వీలు చేసుకొని మరీ హాజరయ్యేందుకే మొగ్గు చూపుతుంటారు. కానీ.. అందుకు భిన్నమైన నిర్ణయాన్ని తీసుకున్నారు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే.

బాలీవుడ్ సినిమాలతో పాటు.. హాలీవుడ్ ఛాన్స్ ల్ని దక్కించుకుంటున్న ఈ హాట్ బ్యూటీ తాజాగా ‘‘లారియల్’’ ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఎంపికయ్యారు. బ్యూటీ ప్రొడక్ట్స్ ను ప్రొడ్యూస్ చేసే ఈ కంపెనీ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మంచి పేరుంది. గతంలోఈ ఉత్పత్తులకు ఐశ్వర్యారాయ్.. సోనమ్ కపూర్ లాంటి వారు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించారు.

తాజాగా దీపికా లారియల్ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ కంపెనీ ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా వ్యవహరించే వారు.. కేన్స్ చలనచిత్రోత్సవం సందర్బంగా రెడ్ కార్పెట్ మీద నడిచే అవకాశాన్ని దక్కించుకుంటారు. ప్రస్తుతం బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న దీపికా.. కేన్స్ రెడ్ కార్పెట్ మీద నడిచే అవకాశం లభించింది. అయితే.. ప్రస్తుతం పద్మవతి మూవీ షూట్ లో బిజీబిజీగా ఉన్నఆమె.. రెడ్ కార్పెట్ మీద నడిచే కార్యక్రమాన్ని స్కిప్ చేయాలని డిసైడ్ అయ్యిందట.

అంతర్జాతీయంగా ఫోకస్ కావటంతో పాటు.. అందరి దృష్టిని ఆకర్షించేందుకు అవకాశం ఉన్నప్పటికీ.. షూటీ బిజీలో ఉన్న నేపథ్యంలో..రెడ్ కార్పెట్ మీద నడిచే అవకాశాన్నిలైట్ తీసుకున్న దీపికా నిర్ణయం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/