కేన్స్ కోసం భలే ముస్తాబైంది

Thu May 18 2017 00:28:27 GMT+0530 (IST)

కేన్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంటుంది. అవార్డుల లెక్క ఒకలా ఉంటే.. అందాలు చిందించే వయ్యారి భామల సొగసుల కోసం గ్లామర్ ప్రియుల ఆరాటం మరోలా ఉంటుంది. కేన్స్ 2017 పండుగలో లో రెడ్ కార్పెట్ పై నడవనున్న తొలి సుందరాంగిగా దీపికా పదుకొనే రికార్డ్ సృష్టించేస్తోంది.

దీనికి ముందు ఈ వయ్యారి బోలెడన్ని మీడియాలకు ఎడాపెడా ఇంటర్వ్యూలు ఇచ్చి పారేసింది. ప్రతీ అప్పియరెన్స్ లో అందాల ఆరబోతకు కొత్త స్పెల్లింగ్స్ రాయించేసింది. అడిగిన వాళ్లను కాదనకుండా.. చెప్పిన ప్రశ్నకు చెప్పకుండా.. రకరకాల పోజులు.. ఎన్నో సమాధానాలతో అలరించిన ఈ బాలీవుడ్ బ్యూటీ.. షోకుల ప్రదర్శనలో కూడా రెచ్చిపోయింది. ఓ సారి సిల్కీ డ్రెస్ లో.. మరోసారి రెడ్ కలర్ డిజైనర్ వేర్ లో తెగ ఆకట్టుకున్న దీపికా పదుకొనే.. రెడ్ కార్పెట్ ఎక్కేందుకు ముందే తనపై అంచనాలను ఆకాశానికి చేర్చేసింది.

ఇక కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం రెడ్ కార్పెట్ పై దీపిక ఏ స్థాయిలో మెరిసిపోనుందో అనే ఆసక్తి మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. ఇక ఇదే వేడుకలో దీపికతో పాటు శృతి హాసన్ కూడా అందాలు చిందించనుండగా.. సీనియర్ సుందరాంగి మల్లికా షెరావత్ కూడా సందడి చేయనుంది.