దీపిక-ప్రియాంక.. తేడా తెలియని హాలీవుడ్

Wed Jan 04 2017 21:58:42 GMT+0530 (IST)

బాలీవుడ్ భామలు అయినా హాలీవుడ్ లో చెలరేగిపోయేందుకు ఎవరి దారిలో వారు దూసుకుపోతున్నారు ప్రియాంక చోప్రా.. దీపికా పదుకొనే. ప్రియాంక కొన్ని నెలలు ముందుగానే టీవీ సిరీస్ ద్వారా ఎంట్రీ ఇవ్వగా.. దీపిక మాత్రం లేట్ అయినా ఏకంగా ట్రిపుల్ ఎక్స్ లాంటి క్రేజీ హాలీవుడ్ యాక్షన్ మూవీతో అరంగేట్రం చేస్తోంది.

ఇంతగా వీరిద్దరి గురించి ప్రచారం జరుగుతున్నా.. ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడిపోతున్నా.. హాలీవుడ్ మీడియాకి మాత్రం ఇంకా వీరిలో తేడాను మాత్రం గుర్తించలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీపికా పదుకొనే నటించిన ట్రిపుల్ ఎక్స్- ది రిటర్న్ ఆఫ్ ది క్సాండర్ కేజ్ మూవీ ఈ నెలలో రిలీజ్ కానుంది. ఇండియాలో జనవరి 14నే రిలీజ్ కానున్న ఈ మూవీ.. ఓవర్సీస్ లో మాత్రం ఈ నెల 19న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా చేపట్టిన ప్రమోషన్స్ లో.. దీపికా పాల్గొంటే.. ఆమెను తెగ ఫోటోలు తీసేసి.. వీడియోలు తీసి రచ్చ చేసిన హాలీవుడ్ మీడియా.. వాటిని పోస్ట్ చేసేటప్పుడు మాత్రం ప్రియాంక చోప్రా అని రాసుకొచ్చేశారట.

తీరా తప్పు తెలుసుకుని బ్యానర్ లో హెడింగ్ మార్చి.. కవర్ చేసుకునే  ప్రయత్నం చేసినా.. లోపల మ్యాటర్ అంతా  ప్రియాంక గురించే ఉండడంతో అవాక్కవాల్సి వచ్చింది. క్యాస్టింగ్ విషయంలో ఖచ్చితంగా ఉండే హాలీవుడ్ లో.. ఇలాంటి తప్పులు జరగడం ఆలోచించాల్సిన విషయమే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/